మెడికో ప్రియాంక కేసు.. కీలక వివరాలను వెల్లడించిన ఎస్పీ
Actor ProfileCelebrity

మెడికో ప్రియాంక కేసు.. కీలక వివరాలను వెల్లడించిన ఎస్పీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మెడికో ప్రియాంక కేసు.. కీలక వివరాలను వెల్లడించిన ఎస్పీ
Samayam Telugu20 Nov 2026
మెడికో ప్రియాంక కేసు.. కీలక వివరాలను వెల్లడించిన ఎస్పీ

మెడికో ప్రియాంక కేసుకు సంబంధించి కీలక వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మద్యం మత్తులో యువకులు ప్రియాంకను కారుతో ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ క్రమంలోనే ప్రియాంక కేసుకు సంబంధించిన వివరాలను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదివారం రోజు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆగస్ట్ మూడో తేదీ ప్రియాంక, తన ఫ్రెండ్ కలిసి థియేటర్‌లో సినిమా చూసి తిరిగి వస్తున్నారు. ఈ సమయంలోనే మద్యం మత్తులో నిందితులు మాల్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. మద్యం తాగి ఉండటంతో మాల్‌లోకి ఎంట్రీకి అనుమతించలేదు.దీంతో నిందితులు మాల్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ సిబ్బంది పట్టుకునేందుకు యత్నించగా.. వేగంగా కారును నడిపి, స్కూటీపై వెళ్తున్న మెడికోలు ప్రియాంక, ఆమె స్నేహితుడిని కారుతో ఢికొట్టారు. నిందితులు మూడుసార్లు కారుతో ఢీకొట్టగా.. ఈ ఘటనలో ప్రియాంకకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ప్రమాద ఘటనపై స్వతంత్ర ఆస్పత్రి నుంచి ఆగస్ట్ మూడో తేదీ రాత్రి పది గంటలకు పోలీసులకు సమాచారం అందింది. ఆరోజు రాత్రే పోలీసులు ప్రియాంక స్నేహితుడు నుంచి వాంగ్మూలం తీసుకుని కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులు మూడుసార్లు స్కూటీని ఢీకొట్టి, ప్రియాంకను గాయపరిచి పారిపోయినట్లు గుర్తించామని ఎస్పీ వివరించారు.మరోవైపు ఘటన క్రూరంగా ఉండటంతో సెక్షన్లలో మార్పులు చేసి కేసు తీవ్రతను పెంచినట్లు ఎస్పీ వివరించారు. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. నిందితులు మద్యం మత్తులో కారు నడిపినట్లు ఆధారాలు సేకరించామని.. హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడించారు. నిందితులను కస్టడీకి అప్పగించాలని