మెడికో ప్రియాంక కుటుంబానికి అండగా సీఎం చంద్రబాబు.. రూ.20 లక్షల ఆర్థిక సాయం
Actor ProfilePolitician

మెడికో ప్రియాంక కుటుంబానికి అండగా సీఎం చంద్రబాబు.. రూ.20 లక్షల ఆర్థిక సాయం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మెడికో ప్రియాంక కుటుంబానికి అండగా సీఎం చంద్రబాబు.. రూ.20 లక్షల ఆర్థిక సాయం
Telugu Times24 Nov 2026
మెడికో ప్రియాంక కుటుంబానికి అండగా సీఎం చంద్రబాబు.. రూ.20 లక్షల ఆర్థిక సాయం

రాజమహేంద్రవరంలో కారు ఢీకొన్న దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక (Priyanka) కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆర్థిక సాయం ప్రకటించారు. యువ వైద్యురాలి అకాల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ఇది అత్యంత బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. ఆదివారం నాడు జిల్లా అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌ (Teleconference)లో మాట్లాడిన సీఎం, బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా తక్షణమే రూ. 20 లక్షల ఆర్థిక సహాయం అందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ దారుణ ఘటనకు కారణమైన వారిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ (Narasimha Kishore) సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, మద్యం మత్తులో మరియు అత్యంత నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న నిందితులు చట్టం నుంచి తప్పించుకోకుండా చూడాలని స్పష్టం చేశారు. దోషులకు కఠిన శిక్ష పడే విధంగా కేసులో బలమైన సెక్షన్లను నమోదు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు