
మోటోరోలా ఎడ్జ్ 70 నియో లాంచ్ ముందే ఫీచర్లు లీక్ రెండర్‌లలో ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్ కనిపిస్తోంది ఈ ఫోన్ మ్యాట్ ఫినిషింగ్, నాలుగు కలర్ ఆప్షన్లలో రానుంది Motorola Edge 70 Neo : మోటోరోలా ఎడ్జ్ 70 నియో అతి త్వరలో మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ లాంచ్ సంబంధించి లీక్ డేటా వెల్లడించింది. ఇప్పుడు, ఈ ఫోన్ రెండర్లు కూడా లీక్ అయ్యాయి. మోటోరోలా ఎడ్జ్ 70 నియో, కంపెనీ ఎడ్జ్ సిరీస్‌లో మరో కొత్త ఫోన్ చేరనుంది. ఈ ఫోన్‌లో అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు ఉంటాయని అంచనా. మోటోరోలా ఎడ్జ్ 70 నియో రెండర్లు, డిజైన్‌ను కూడా వెల్లడిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. మోటోరోలా ఎడ్జ్ 70 నియో లాంచ్ ముందే రెండర్లు లీక్ అయ్యాయి. ఈ రెండర్లను మ్యాక్ అబ్జర్వర్ ( Vave ) ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోన్ పింక్, బ్రైట్ గ్రీన్, లైట్ గ్రీన్, లైట్ బ్లూ అనే 4 కలర్ ఆప్షన్లలో కనిపిస్తుంది. ఈ ఫోన్ మ్యాట్ ఫినిషింగ్‌తో వస్తుంది. పింక్ వేరియంట్‌లో భిన్నమైన మోడల్ ఉంది. ఫోన్ డిస్‌ప్లే ఎడ్జుల వద్ద కర్వ్ కనిపిస్తుంది. కంపెనీ ఇప్పటికే ఎడ్జ్ సిరీస్‌లో అద్భుతమైన డిస్‌ప్లేను అందించింది. Read Also : Moto G06 Power Price : ఇది కదా డిస్కౌంట్.. ఈ మోటోరోలా G06 పవర్ ఫోన్ జస్ట్ రూ. 14వేలకే.. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్ కనిపిస్తుంది. సెన్సార్లలో 200MP అని లేబుల్ ఉంది. మెయిన్ కెమెరా సెన్సార్ కావచ్చు. ఎడ్జ్ 70 నియో పూర్తి వివరాలు ఇంకా రివీల్ కాలేదు. ఈ సిరీస్‌లో ఇప్పటికే అనేక మోడళ్లు ఉన్నాయి. మోటోరోలా ఎడ్జ్ 70 నియో ఫోన్ గత మోడల్ ఎడ్జ్ 60 నియోకి అప్‌గ్రేడ్ వెర్షన్. మోటోరోలా