మెట్రో పాస్ లకు ఎల్ అండ్ టీ విముఖత
Actor ProfileCelebrity

మెట్రో పాస్ లకు ఎల్ అండ్ టీ విముఖత

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మెట్రో పాస్ లకు ఎల్ అండ్ టీ విముఖత
Eenadu12 Dec 2026
మెట్రో పాస్ లకు ఎల్ అండ్ టీ విముఖత

మెట్రోరైళ్లో ప్రయాణికుల సౌకర్యార్థం రోజువారీ, నెలవారీ పాస్‌లను ప్రవేశపెట్టేందుకు ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ విముఖత వ్యక్తం చేసింది. ఇప్పుడున్న నెట్‌వర్క్‌లో పాస్‌లు సాధ్యం కాదని విస్పష్టంగా తెలిపింది. మెట్రోరైలు ప్రారంభం దగ్గర్నుంచి పాస్‌ల కోసం ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు. మెట్రో అధికారులు పలుమార్లు ఎల్‌ అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ దృష్టికి తీసుకెళ్లినా.. సానుకూలత వ్యక్తం చేయలేదు.మెట్రోలో పాసులు ఉండవనే సంకేతాలను ఇస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా మరోమారు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గత నెలాఖరున జరిగిన హైదరాబాద్‌ మెట్రోరైలు లిమిటెడ్‌(హెచ్‌ఎంఆర్‌ఎల్‌) బోర్డు సమావేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఛైర్మన్‌ సంజయ్‌జాజు మెట్రోలో పాసులు ప్రవేశపెట్టేందుకు మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. వారు ఎల్‌ అండ్‌టీ మెట్రోతో పాస్‌ల అంశం చర్చించినప్పుడు విముఖత చూపింది. పాస్‌ల అంశం తదుపరి ఎలా ముందుకు తీసుకెళ్లాలి? అనేది గురువారం జరిగే మెట్రోరైలు బోర్డు సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. బోర్డులో తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా అధికారులు నడుచుకోనున్నారు. మెట్రో, ఆర్టీసీలో ఉమ్మడి టికెట్, పాస్‌లపై గతవారం ఆర్టీసీతో జరిగిన సమావేశం వివరాలను, పురోగతిని సీఎస్‌ సమీక్షించే అవకాశం ఉంది. మెట్రోరైలు మొదటిదశ స్వాధీనంలో కీలకమైన రుణ సమీకరణ, 45 రోజుల్లోనే ఎన్‌బీఐ క్యాప్స్‌ ఈ ప్రక్రియ పూర్తి చేసేలా చూడడం, రెండోదశ అనుమతుల వరకు చర్చించే అవకాశం ఉంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు