మొజ్తాబా బతికే ఉన్నారు.. వీడియో రిలీజ్ చేసిన ఇరాన్
Actor ProfilePolitician

మొజ్తాబా బతికే ఉన్నారు.. వీడియో రిలీజ్ చేసిన ఇరాన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మొజ్తాబా బతికే ఉన్నారు.. వీడియో రిలీజ్ చేసిన ఇరాన్
Andhra Jyothy19 Nov 2026
మొజ్తాబా బతికే ఉన్నారు.. వీడియో రిలీజ్ చేసిన ఇరాన్

ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తాబా అలీ ఖమేనీ పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని, త్వరలో చనిపోతాడని ఇజ్రాయెల్ మీడియా చేస్తున్న ప్రచారంపై ఇరాన్ స్పందించింది. ప్రభుత్వానికి చెందిన సెమీ అఫిషియల్ న్యూస్ ఏజెన్సీ మెహర్.. మొజ్తాబాకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఇంటర్‌నెట్ డెస్క్: ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తాబా అలీ ఖమేనీ పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని, త్వరలో చనిపోతాడని ఇజ్రాయెల్ మీడియా చేస్తున్న ప్రచారంపై ఇరాన్ స్పందించింది. ప్రభుత్వానికి చెందిన సెమీ అఫిషియల్ న్యూస్ ఏజెన్సీ మెహర్.. మొజ్తాబాకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో మొజ్తాబా ఇరాన్ నాయకులతో మాట్లాడుతున్నారు. ఈ వీడియోతో మొజ్తాబా ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టినట్లు అయ్యింది. 13 సెకన్ల నిడివి కలిగిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెహర్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసిన మొజ్తాబా వీడియోపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వీడియో ఎప్పుడు తీశారనే విషయాన్ని మెహర్ స్పష్టం చేయలేదు. సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తూ.. ‘ఇది యుద్ధానికి ముందు తీసిన పాత వీడియో. ప్రజలను పక్కదారి పట్టించడానికి ఇరాన్ ఇప్పుడు వాడుతోంది’ అని అంటున్నారు. ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా టెహ్రాన్‌లోని ఇరాన్ లీడర్‌షిప్ కాంపౌండ్‌పై దాడులు చేశాయి. ఈ దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆయతుల్లా ఖమేనీతో పాటు భార్య, కోడలు, మనవరాలు కూడా ప్రాణాలు కోల్పోయారు. అంతర్జాతీయ మీడియా సంస్థలు ది న్యూయార్క్ టైమ్స్, రాయిటర్స్ నివేదికల ప్రకారం.. ఈ దాడిలో మొజ్తాబా ముఖం, కళ్లు, కాళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఇరాన్ ప్రభుత్వం ఆయనకు ప్రాణాపాయం లేదని, కోమాలోకి వెళ్లలేదని చెప్తున్నప్పటికీ.. ప్రభుత్వ అధికారిక ఛానెల్స్ ఆయనను "జాన్‌బాజ్" (యుద్ధంలో తీవ్రంగా గాయపడిన వీరుడు) అని సంబోధించడం అనుమానాలకు తావిస్తోంది. దాదాపు 5 నెలల నుంచి ఆయన బయట ఎక్కడా కనిపించటం లేదు