మాచర్లలో ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు
Actor ProfilePolitician

మాచర్లలో ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మాచర్లలో ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు
Eenadu21 Nov 2026
మాచర్లలో ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

గట్టు: జోగులాంబ గద్వాల జిల్లా మాచర్ల గ్రామంలో భారత యువ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ మహబూబ్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బెందల రాజేష్, గద్వాల యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు కురువ సురేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎండీ మహబూబ్ మాట్లాడుతూ.. 1960 ఆగస్టు 9న ప్రారంభమైన భారత యువ కాంగ్రెస్, దేశ యువతను నాయకులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు