
ఒకవైపు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కురుస్తున్న కుంభవృష్టి.. మరోవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పొరుగు దేశానికి భారత్ ఇస్తున్న జల హెచ్చరికలు.. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ వేదికగా అటు ప్రకృతి విపత్తు, ఇటు వ్యూహాత్మక దౌత్యం ఒకేసారి చర్చనీయాంశంగా మారాయి. దోడా-కిశ్త్‌వాడ్ పరిధిలో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా చీనాబ్ నది ఉగ్రరూపం దాల్చింది.దీంతో రాంబన్ జిల్లాలోని బగ్లిహార్ డ్యామ్ ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అధికారులు సోమవారం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మూడు గేట్లను ఎత్తివేసి నీటిని కిందకు విడుదల చేశారు. గతేడాది పహల్గాం ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన నేపథ్యంలో, మునుపెన్నడూ లేని విధంగా డ్యామ్ గేట్లను తెరవడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.కిశ్త్‌వాడ్‌ను ముంచెత్తిన మేఘ విస్ఫోటంజమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్ ప్రాంతంలో ఒక్కసారిగా మేఘ విస్ఫోటం (Cloudburst) సంభవించడంతో ఊహించని రీతిలో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగిపడటంతో రహదారులన్నీ బురదమయంగా మారాయి. ఈ ప్రకృతి ప్రకోపానికి కిశ్త్‌వాడ్‌లో నిర్మాణంలో ఉన్న 540 మెగావాట్ల భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు సైట్ తీవ్రంగా దెబ్బతింది. కొండల నుంచి దూసుకొచ్చిన భారీ రాళ్లు, మట్టి పెళ్లల కింద ప్రాజెక్టుకు చెందిన అనేక వాహనాలు, మిల్లులు, ఇతర యంత్రాలు పూర్తిగా కూరుకుపోయాయి.సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్‌ఎప్, ఎస్‌డీఆర్‌ఎఫ్, భారత ఆర్మీ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. భారీ యంత్రాల సహాయంతో బురదను తొలగించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ను ముమ్మరం చేశారు. బాధితులకు, పర్యాటకులకు తక్షణ సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసింది. అయితే ఈ ఘటనలో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బంగాళాఖాతంలో వాయుగుండం.. తుఫానుగా మారుతోందా?ఉగ్రవాదం వీడేవరకు పాకిస్తాన్‌కు జల గండమే!ఈ వరద విపత్తుల నడుమే సింధు జలాల ఒప్పందం (IWT)పై భారత్ తన కఠిన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. సరిహద్దు
