మెగా హీరోల వరుస హిట్లు.. మిగిలిపోయింది ఆ హీరో ఒక్కడే
Actor ProfileActor

మెగా హీరోల వరుస హిట్లు.. మిగిలిపోయింది ఆ హీరో ఒక్కడే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మెగా హీరోల వరుస హిట్లు.. మిగిలిపోయింది ఆ హీరో ఒక్కడే
123Telugu3 Dec 2026
మెగా హీరోల వరుస హిట్లు.. మిగిలిపోయింది ఆ హీరో ఒక్కడే

మెగా క్యాంప్‌లోని హీరోలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర హిట్స్ కొడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజి’, మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ఇక లేటెస్ట్‌గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ‘కొరియన్ కనకరాజు’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని ఈ జాబితాలో చేరిపోయాడు. చాలా రోజుల తర్వాత ఎంతో అవసరమైన సాలిడ్ కమ్‌బ్యా్క్‌ను అందుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే, ఈ మెగా క్యాంప్‌లో ఇక హిట్టు కొట్టాల్సిన హీరో ఒకరు మాత్రమే ఉండిపోయారు. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’లో నటిస్తున్నాడు. ఈ చిత్రంతో సాయి ధరమ్ తేజ్ కూడా సాలిడ్ హిట్ అందుకుంటాడని మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మెగా హీరోలు ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు