ముగ్గురు హీరోలు ఆరోగ్య సమస్యలతో సతమతం
Actor ProfileActor

ముగ్గురు హీరోలు ఆరోగ్య సమస్యలతో సతమతం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ముగ్గురు హీరోలు ఆరోగ్య సమస్యలతో సతమతం - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema8 Dec 2026
ముగ్గురు హీరోలు ఆరోగ్య సమస్యలతో సతమతం - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

ముగ్గురు హీరోలు (Telugu Stars) రకరకాల సమస్యలతో (Health Issues) బాధపడుతున్నారు. ఒక పెద్ద హీరో కీళ్ల నొప్పులు, నడుము నొప్పితో గత ఎనిమిదేళ్ళుగా సతమతం అవుతున్నారు. విదేశాల్లో ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత కుదుటపడ్డారు. ఐతే, ఇప్పటికీ షూటింగ్ లో “హెవీ” ఎపిసోడులు చెయ్యలేకపోతున్నారట. ఎక్కువగా అలాంటి సన్నివేశాలకు డూపులని ఉపయోగిస్తున్నారు. ఐతే, కొందరు “పెర్ఫెక్షనిస్ట్” దర్శకులు డూపులు వద్దని చెప్పినప్పుడు సదరు పెద్ద హీరో ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయి ఆ తర్వాత చాలా రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందట. ఒక పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ చిత్రం కోసం తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి నటించారు. అప్పటి నుంచి ఈ సమస్యలు. అలాగే మరో హీరో కూడా ఈ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ లో నటించి ఆరోగ్యాన్ని మొత్తంగా పాడుచేసుకున్నారు. ఇతను కూడా విదేశాల్లో ట్రీట్మెంట్ చేయించుకొని ప్రస్తుతం సినిమాలు తగ్గించారు. నటించడం కన్నా వ్యాపారాలు చూసుకుంటూ ఎక్కువగా గడుపుతున్నారు. ఐతే, ఈ హీరో ప్రస్తుతం ఎక్కువగా రెస్ట్ తీసుకుంటున్నారు పాత సమస్య ఎక్కువగా మళ్ళీ బాధిస్తుండడంతో. మరో అగ్ర హీరో కూడా ఒక గ్లోబల్ హిట్ చిత్రంలో నటించిన తర్వాత అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. గత రెండేళ్లుగా ఈ హీరో ఎక్కువగా డాక్టర్లు, హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు