మెగా158' అసలు టైటిల్ ఇదే.. మూవీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
Actor ProfileCelebrity

మెగా158' అసలు టైటిల్ ఇదే.. మూవీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మెగా158' అసలు టైటిల్ ఇదే.. మూవీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
TeluguOne9 Jan 2027
మెగా158' అసలు టైటిల్ ఇదే.. మూవీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #Mega158 గురించిన క్రేజీ అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ చిత్రానికి 'కాకా' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. 'Mega158' సినిమాకి మొదటినుంచి 'కాకా', 'కాకాజీ' టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇటీవల 'కొరియన్ కనకరాజ్' సక్సెస్ మీట్ లో.. 'Mega158' టైటిల్ గురించి మాట్లాడుతూ, 'కదిరి' అంటూ టంగ్ స్లిప్ అయ్యారు. దాంతో ఈ మూవీ టైటిల్ 'కదిరి కాకాజీ' అయ్యుంటుందని అందరూ భావించారు. కానీ, ఇప్పుడు మళ్ళీ 'కాకా' టైటిల్ నే ఫైనల్ చేసినట్లు న్యూస్ వినిపిస్తోంది. చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆగస్టు 22న రాబోయే బర్త్‌డే స్పెషల్ టీజర్‌లో ఈ చిత్ర టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఆ రోజే టీజర్‌తో పాటు సినిమా రిలీజ్ డేట్‌ను కూడా రివీల్ చేయబోతున్నారు. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్నివిడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యాక్షన్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ పర్ఫెక్ట్ పండగ సినిమాలా బాబీ దీనిని మలుస్తున్నట్లు సమాచారం. KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. వాళ్ళకి మాత్రం షాక్: ఓటీటీలోకి జననాయకుడు.. డేట్ ఇదే ఎందుకు వెళ్లిపోయిందో తెలిసింది.. కేరళ యూట్యూబర్ అఖిల్ భార్య సంచలనం