మోక్షజ్ఞ కోసం బాలయ్య మాస్టర్ ప్లాన్..? సీన్ లోకి సందీప్ వంగా పేరు
Actor ProfileActor

మోక్షజ్ఞ కోసం బాలయ్య మాస్టర్ ప్లాన్..? సీన్ లోకి సందీప్ వంగా పేరు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మోక్షజ్ఞ కోసం బాలయ్య మాస్టర్ ప్లాన్..? సీన్ లోకి సందీప్ వంగా పేరు
Telugu Times19 Oct 2026
మోక్షజ్ఞ కోసం బాలయ్య మాస్టర్ ప్లాన్..? సీన్ లోకి సందీప్ వంగా పేరు

— సూర్య ప్రకాష్ జోశ్యుల "ఒక హీరో హిట్ కొడితే... మరో సినిమా వస్తుంది." కానీ ఒక స్టార్ హీరో తన వారసుడిని ప్రేక్షకులకు పరిచయం చేస్తే... అది కేవలం సినిమా కాదు. ఒక కుటుంబ గౌరవం, ఒక అభిమాన వర్గం ఆశలు, ఒక వారసత్వం అన్నీ ఒకే ఫ్రేమ్‌లో నిలబడతాయనేది నిజం. అందుకే గత కొంతకాలంగా మోక్షజ్ఞ తొలి సినిమా గురించి చిన్న వార్త వచ్చినా... అది సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారుతోంది. గత కొన్ని ఏళ్లుగా నందమూరి అభిమానులు ఒక్క ప్రశ్నే అడుగుతున్నారు. "మోక్షజ్ఞ ఎప్పుడు వస్తాడు?" ఆ ప్రశ్నకు సమాధానం ఇంకా అధికారికంగా రాకపోయినా... ఫిలింనగర్‌లో వినిపిస్తున్న తాజా ప్రచారం మాత్రం అంచనాలను మరోసారి పెంచుతోంది. అదేమిటి? ఎందుకీ లేటు ఎపిసోడ్ 1: ఒక ప్రాజెక్ట్ ఆగింది... కానీ ప్లాన్ మాత్రం ఆగలేదు మొన్నటివరకు 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ తొలి సినిమా తెరకెక్కనుందనే ప్రచారం జరిగింది. ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదనే వార్తలు కూడా వినిపించాయి.దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అయితే ప్రధాన కారణం ...సూపర్ హిట్ ఇవ్వాలి. అందుకే ఈసారి బాలకృష్ణ తొందరపడటం లేదు. "మొదటి సినిమానే ముద్ర వేయాలి" అనే ఆలోచనతో కథపై మళ్లీ మళ్లీ పని చేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరో పేరు చర్చల్లోకి వచ్చింది. అదే సందీప్ రెడ్డి వంగా. అయితే ఇక్కడో క్లారిటీ ఇవ్వాలి. ప్రస్తుతం వినిపిస్తున్న ప్రచారం ప్రకారం... సందీప్ వంగా దర్శకుడిగా కాదు. బాలకృష్ణ సిద్ధం చేసిన కథకు క్రియేటివ్ ఇన్‌పుట్స్, స్క్రిప్ట్ స్థాయిలో సూచనలు ఇస్తున్నారనే చర్చ జరుగుతోంది. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయినా... సందీప్ వంగా అనే ఒక్క పేరు చాలు... సోషల్ మీడియా మొత్తం ఊహాగానాలతో నిండిపోయింది. ఎపిసోడ్ 2: బాలయ్య ఎందుకు ఇంత జాగ్రత్త పడుతున్నారు? బాలకృష్ణకు హిట్లు కొత్త కాదు. బ్లాక్‌బస్టర్లు అసలే