తన జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయన్నారు టీడీపీ ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ . దేవుడు అన్ని కుటుంబాలకు ఓ పరీక్ష పెడతారని.. తమ కుటుంబానికి ఆ పరీక్ష తన రూపంలో వచ్చిందన్నారు. తన శత్రువులకు ఇలాంటి పరిస్థితి ఎదురవ్వకూడదని దేవుడ్ని కోరుకుంటానన్నారు. తన జీవితంలో ఎన్నో విషాదాలను చూశానని.. తన ఐదేళ్ల కుమారుడు చనిపోవడం.. తాతయ్య, అమ్మమ్మ చనిపోయినప్పుడు ఎంతో ఏడ్చానన్నారు. తన తల్లికి హార్ట్ హార్ట్ ఎటాక్ వచ్చిన సమయంలో ఎంతో బాధపడ్డానన్నారు. గ్రీష్మ ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవితంలో ఎదురైన కష్టాల గురించి చెప్పి ఎమోషనల్ అయ్యారు. ప్రజల ముందు ఉన్నప్పుడు ధైర్యంగా ఉండాలని తాత, అమ్మమ్మ, తన తల్లి ప్రతిభా భారతి ఎంతో నేర్పించారన్నారు. అందుకే జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు త్వరగా బయటపడేందుకు ప్రయత్నినన్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఓ ఏడాది పాటూ బ్రేక్ తీసుకున్నానని చెప్పుకొచ్చారు. ఏదైనా బాధ కలిగితే చిన్న బ్రేక్ తీసుకుని మళ్లీ యాక్టివ్ అయితే సరిపోతుందన్నారు.మంచి కుటుంబంలో పుట్టిన తాను గారాబంగా పెరిగానన్నారు గ్రీష్మ. కానీ జీవితంలో తనకు ఎదురైన కష్టాలు, ఒడిదుడుకులు ఎవరికి ఎదురుకాకూడదని.. అందరూ బాగుండాలి, అందులో తాము కూడా ఉండాలని మొక్కుకుంటానన్నారు. మొదటి వివాహం బ్రేక్ అయ్యిందని.. భర్తతో విడాకులు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఐదేళ్ల వయసున్న కొడుకుని పోగొట్టుకుని ఇక పెళ్లి వద్దని భావించి.. తన జీవితం అంతా అయిపోయిందని భావించానన్నారు. అలాంటి సమయంలో తనకు శ్రీనివాస్ పరిచయం అయ్యారని.. ఆయన కూడా మొదటి వివాహం చేసుకున్న సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చారు. శ్రీనివాస్‌కు, నాకు ఇది రెండో వివాహం.. ఆయనది ప్రొద్దుటూరు.. ఆయనకు తమ్ముడు ఉన్నాడు.. వాళ్లు ఇన్ఫ్రా కాంట్రాక్టర్స్. శ్రీనివాస్‌ను వాసు అని పిలుచుకుంటాను.. ఆయన్ను కలవడం అదృష్టంగా భావిస్తాను' అన్నారు.'శ్రీనివాస్ అమెరికా వెళ్లారు.. అక్కడ ఉద్యోగం చేసి మళ్లీ ఇక్కడికి వచ్చేశారు. ఆరు నెలల్లో పెళ్లి సంబంధం కుదరలేదు.. కానీ
Samayam Telugu•26 Nov 2026
భర్తతో విడాకులు, కొడుకు చనిపోయాడు.. ఐదేళ్లు నరకం చూశా
10TV Telugu•15 Jun 2026
కట్నం డబ్బులు ఇవ్వలేనోడికి నాకు పెళ్లెందుకు చేశార్రా?.. అక్క మాటలకు పాపం ఆ తమ్ముడుDowry Harassment: అదనపు కట్నం వేధింపులు కేవలం ఆడబిడ్డలనే కాదు, ఒక్కోసారి వారి కుటుంబాలలోని మగవారి ప్రాణాలను సైతం బలి తీసుకుంటాయనే దానికి ఈ ఘటనే నిదర్శనం. జవహర్ నగర్ పరిధిలోని చెన్నాపురానికి చెందిన