
భావితరాలకు స్వాతంత్ర్య సమరయోధుల గురించి తెలియజేయాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అంతరాలు మరచి ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జీవించాలని ఆకాంక్షించారు. ఇంటర్‌నెట్ డెస్క్: భావితరాలకు స్వాతంత్ర్య సమరయోధుల గురించి తెలియజేయాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అంతరాలు మరచి ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జీవించాలని ఆకాంక్షించారు. ఆదివారం పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘ఈ తిరంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతిఒక్కరికీ అభినందనలు. భావితరాల బాగు కోసం పోరాటం చేసిన మహనీయులను స్మరించు కోవటం ముఖ్యం. భారత దేశ ప్రజలు 79వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనున్నారు’.. ‘గ్రామ గ్రామాన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. కులాలకు, మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ స్వాతంత్ర్య దినోత్సవం. కేంద్రంలో బలమైన నాయకత్వం ఉంది. దేశంలో పెరుగుతున్న అరాచక శక్తులను పారద్రోలుతూ నేటి పాలకులు పని చేస్తున్నారు’అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎంతటి వారైనా మెడలు వంచక తప్పదు: టీపీసీసీ చీఫ్