
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) నేత సర్దార్ అమన్ ఖాన్.. భారత సాయం కోరారు. పాకిస్థాన్ ప్రభుత్వం ఆర్థిక దిగ్బంధం విధించిందని, ప్రజలు ఆహారం, మందుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోలో అమన్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘మాకు భారత్ సాయం అవసరం. రేషన్, మందులు కొరతగా ఉన్నాయి. మానవతా దృష్టితో భారత్ ఆదుకోవాలి’’ అని విజ్ఞప్తి చేశారు. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద సరిహద్దును తెరవాలని కోరారు. పరిస్థితులు మరింత దిగజారితే ప్రజలు భారత్‌కు వచ్చే అవకాశం కల్పించాలని సూచించారు.రావల్‌కోట్‌లో జరిగిన భారీ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. ‘‘ఎల్‌ఓసీ వైపు వెళ్లాలా?’’ అని ప్రశ్నించారు. అక్కడున్న ప్రజలు ‘‘వెళ్దాం’’ అంటూ నినాదాలు చేశారు. ప్రజల డిమాండ్లకు తూటాలతో సమాధానం ఇస్తే తమ వద్ద మరో మార్గం కూడా ఉందని ఆయన హెచ్చరించారు.నెల రోజుల నుంచి పీఓకేలో పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు కొనసాగుతున్నాయి. సంస్కరణల డిమాండ్‌తో ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యం కోరే దిశగా మారిందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు