భారత్ లో సౌర విద్యుత్ విప్లవం.. నిల్వ
Actor ProfilePolitician

భారత్ లో సౌర విద్యుత్ విప్లవం.. నిల్వ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
భారత్ లో సౌర విద్యుత్ విప్లవం.. నిల్వ, గ్రిడ్ పంపిణీలో సవాళ్ళివే
TeluguOne7 Dec 2026
భారత్ లో సౌర విద్యుత్ విప్లవం.. నిల్వ, గ్రిడ్ పంపిణీలో సవాళ్ళివే

ఇండియా ఇంధన రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. సాంప్రదాయ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి పై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ, హరిత ఇంధనం వైపు వేగంగా అడుగులు వేస్తోంది. గత నాలుగేళ్లలో దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తి ఏకంగా 138 శాతానికి పైగా వృద్ధి చెందింది. ఇది కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు. దేశ వ్యూహాత్మక ఇంధన అవసరాల దిశలో వచ్చిన అసాధారణ పరిణామం. విద్యుత్ డిమాండ్ ఏటా వేగంగా పెరుగుతున్న తరుణంలో.. పునరుత్పాదక శక్తి వనరులను విస్తరించడం ఆవశ్యకంగా మారింది. సుమారు 60 బిలియన్ యూనిట్ల స్థాయిలో ఉన్న సౌర విద్యుత్ ఉత్పత్తి.. ప్రస్తుతం 143 బిలియన్ యూనిట్లకు పైగా పెరిగింది. ఇదే సమయంలో దేశంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తి కూడా 1,484 బిలియన్ యూనిట్ల నుండి 1,840 బిలియన్ యూనిట్లకు పైగా పెరిగింది. విస్తరిస్తున్న ఈ డిమాండ్‌ను తట్టుకోవడంలో సోలార్ ప్రాజెక్టులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వేగంగా సౌర శక్తిని విస్తరిస్తున్న ప్రధాన దేశాల జాబితాలో భారత్ అగ్రగామిగా నిలుస్తోంది. దశాబ్దాల ప్రయాణం.. 3 గిగావాట్ల నుండి 129 గిగావాట్లకు.. సౌర రంగంలో ఈ స్థాయి పురోగతి ఒక్క రోజులో సాధ్యమైనది కాదు. గత పన్నెండేళ్లలో ప్రభుత్వ విధానాలు, విదేశీ, ప్రైవేట్ పెట్టుబడులు, ప్యానెల్ల తయారీలో సాంకేతిక విప్లవం, పోటీ బిడ్డింగ్ విధానాలు ఈ రంగాన్ని పరుగులు పెట్టించాయి. 2014 నాటికి దేశంలో సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యం కేవలం 3 గిగావాట్ల మేర మాత్రమే ఉండేది. కానీ ప్రస్తుతం ఆ సామర్థ్యం 129 గిగావాట్లకు చేరుకోవడం ఒక మైలురాయి. . గుర్తించాల్సిన అంశమేంటంటే.. స్థాపిత సామర్థ్యం (గిగావాట్లు) పెరిగినంత మాత్రాన, నిరంతర విద్యుత్ ఉత్పత్తి (బిలియన్ యూనిట్లు) జరగదు. వాతావరణ మార్పులు, మేఘావరణం, సూర్యకాంతి సమయం, గ్రిడ్ పరిమితులు వాస్తవ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం: గృహ వినియోగదారులకు సౌర కాంతి సాధారణ పౌరులను