
గాలె: శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ జోరు కొనసాగుతోంది. తొలి రోజు ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని మంచి పునాది వేసుకున్న టీమిండియా... రెండో రోజు దాన్ని మరింత బలపరుచుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 288/2తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్... రెండో రోజు ఆట ముగిసే సమయానికి 116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది. వర్షం కారణంగా రెండో రోజు 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. సెంచరీ హీరో దేవదత్ పడిక్కల్ (230 బంతుల్లో 167; 15 ఫోర్లు, 1 సిక్స్) క్రితం రోజు స్కోరుకు మరో 36 పరుగులు జోడించి అవుట్ కాగా... ధ్రువ్ జురేల్ (68 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. గాయం నుంచి కోలుకొని బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ (175 బంతుల్లో 82; 10 ఫోర్లు, 1 సిక్స్) మరో ఐదు పరుగులే చేశాడు. రిషభ్ పంత్ (39), మానవ్ సుతార్ (24) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. కుల్దీప్ యాదవ్ (12 బ్యాటింగ్), ప్రసిధ్ కృష్ణ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4 వికెట్లు పడగొట్టగా... కుషారా నువాంతా 175 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుండగా... మూడో రోజు ఇక్కడ బ్యాటింగ్ మరింత కష్టం కానుంది. ఆదుకున్న జురేల్... భారీ వర్షం కారణంగా ఆదివారం రెండు సెషన్‌ల ఆట తుడిచిపెట్టుకుని పోయింది. మధ్యాహ్నం తర్వాత మైదానం ఆటకు అనుకూలంగా మారగా... తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు లంక మెరుగ్గా బౌలింగ్ చేసింది. పంత్ ఎక్కువసేపు నిలవలేకపోగా... కండరాలు పట్టేయడంతో తొలి రోజు మైదానాన్ని వీడిన రాహుల్ క్రీజులోకి వచ్చాడు. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై అతడు అదనపు బౌన్స్‌కు దొరికిపోయాడు. 12 పరుగుల వ్యవధిలో వీరిద్దరూ వెనుదిరగగా... ఈ దశలో జురేల్