భారత్ కు గుడ్ న్యూస్.. హార్మూజ్ జలసంధి దాటిన 15 ఎరువుల నౌకలు
Actor ProfilePolitician

భారత్ కు గుడ్ న్యూస్.. హార్మూజ్ జలసంధి దాటిన 15 ఎరువుల నౌకలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
భారత్ కు గుడ్ న్యూస్.. హార్మూజ్ జలసంధి దాటిన 15 ఎరువుల నౌకలు
Oneindia Telugu24 Sept 2026
భారత్ కు గుడ్ న్యూస్.. హార్మూజ్ జలసంధి దాటిన 15 ఎరువుల నౌకలు

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలు అస్తవ్యస్తమైనప్పటికీ, దేశీయంగా ఎరువుల కొరత రాకుండా భారత్ విజయవంతంగా అధిగమించింది. విదేశాల నుంచి ఎరువుల దిగుమతులు సజావుగా సాగడం, దేశీయంగా ఉత్పత్తి అంచనాలను మించి నమోదు కావడంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అన్ని రకాల ముందస్తు నివారణ చర్యలు చేపట్టింది.హార్మూజ్ జలసంధి, ఎర్రసముద్ర మార్గాల్లో నౌకల రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఎదురైనప్పటికీ, వ్యూహాత్మక ప్రణాళికలతో సరఫరా గొలుసు దెబ్బతినకుండా ప్రభుత్వం పర్యవేక్షించింది. భారత్‌ కు ఎరువులు, ముడిసరుకును తీసుకువచ్చే 20 నౌకలలో 15 ఇప్పటికే సురక్షితంగా ప్రయాణించి గమ్య స్థానాలకు చేరుకున్నాయి. వీటిలో 3.32 లక్షల టన్నుల యూరియా, 2.57 లక్షల టన్నుల డీఏపీతో పాటు సల్ఫర్ నిల్వలు కూడా ఉన్నాయి. మిగిలిన 5 నౌకలు కూడా నిర్దేశిత సమయానికి భారత రేవులకు చేరుకోనున్నాయి.దౌత్యపరమైన చొరవ, గ్యాస్ సరఫరా పునరుద్ధరణఅంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ, దేశీయ రైతులకు ఆ భారం పడకుండా ప్రభుత్వం చొరవ తీసుకుంది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్ష పర్యవేక్షణలో చేపట్టిన దౌత్యపరమైన చర్చల ఫలితంగా రష్యా, ఒమన్, మొరాకో, అమెరికా, వియత్నాం, ఈజిప్ట్ వంటి వివిధ దేశాల నుంచి ప్రత్యామ్నాయ మార్గాల్లో దిగుమతులను సురక్షితంగా రప్పించగలిగారు. దీంతో పాటు, గతంలో 65 శాతానికి పడిపోయిన దేశీయ ఎరువుల కర్మాగారాల సహజ వాయువు సరఫరాను తిరిగి 100 శాతానికి పునరుద్ధరించడంతో తయారీ ఊపందుకుంది.ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయంగా ఎరువుల ఉత్పత్తి అంచనాలను మించి సత్తా చాటింది. నిర్దేశిత 67.86 లక్షల టన్నుల లక్ష్యానికి భిన్నంగా రికార్డు స్థాయిలో 71.55 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి అయింది. డీఏపీ ఉత్పత్తి కూడా 8.61 లక్షల టన్నుల లక్ష్యానికి బదులుగా 9.84 లక్షల టన్నులుగా నమోదైంది. ఎన్‌ పీకే ఎరువుల ఉత్పత్తి