భాజపా కంచుకోట నుంచి ఎన్నికల బరిలో ప్రశాంత్ కిశోర్
Actor ProfilePolitician

భాజపా కంచుకోట నుంచి ఎన్నికల బరిలో ప్రశాంత్ కిశోర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
భాజపా కంచుకోట నుంచి ఎన్నికల బరిలో ప్రశాంత్ కిశోర్
Eenadu23 Sept 2026
భాజపా కంచుకోట నుంచి ఎన్నికల బరిలో ప్రశాంత్ కిశోర్

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నికల వ్యూహకర్త, జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలవబోతున్నారు.బిహార్‌లోని బంకీపుర్‌ స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఈ ఉప ఎన్నిక కోసం ప్రశాంత్‌ కిశోర్‌ను అభ్యర్థిగా నిలబెడుతున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతీ వెల్లడించారు. ఈనెల 30న బంకీపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఆగస్టు 3న ఫలితాలను ప్రకటించనున్నారు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి భాజపా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నితిన్‌ నబీన్‌ ఎన్నికయ్యారు. అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నితిన్‌ నబీన్‌ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. భాజపాకు కంచుకోట అయిన ఈ స్థానానికి ఆ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ పార్టీని స్థాపించిన ప్రశాంత్‌కిశోర్‌ గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదురుచూశారు. తాను పోటీ చేయకపోయినప్పటికీ తన పార్టీ జన్‌ సురాజ్‌ తరఫున పోటీ చేసిన ఒక్క అభ్యర్థినీ గెలిపించలేకపోయారు. 243 స్థానాలకు గానూ 238 సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ ఒక్కసీటులోనూ ఆ పార్టీ గెలవలేకపోయింది. దీంతో అప్పట్లో ఓటమికి బాధ్యత వహిస్తూ మౌనవ్రతం కూడా చేశారు. దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల కోసం మూడు రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. జులై 6న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర