
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. July Month Heroins Waiting Fate: జూలై నెల భాగ్యశ్రీ బోర్సే లక్‌ను ఛేంజ్ చేసింది. గ్లామర్ తారగా ఈ తారకు మంచి అవకాశాలు వస్తోన్న సరైన సక్సెస్‌లు మాత్రం రావడం లేదు. అంతేకాదు భాగ్యశ్రీ బోర్సే నటించిన సినిమాలన్ని పీరియాడిక్ మూవీస్ కావడం విశేషం. తాజాగా అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ మూవీ జూలై 10న విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ కూడా పీరియాడిక్ మూవీ కావడం విశేషం. ఈ సినిమాకు పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అంతేకాదు ఈ సినిమా సక్సెస్ భాగ్యశ్రీకి మాత్రమే కాదు.. అఖిల్‌కు నిర్మాతగా నాగవంశీకి.. దర్శకుడి మురళీ కిషోర్‌కు మంచి కిక్ ఇచ్చింది. దీంతో ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలు అన్నట్టుగా ఈ సినిమా సక్సెస్ వీళ్లందరికి ఊపిరి పోసింది. ‘ఓ సుకుమారి’ మూవీపై ఐశ్వర్య రాజేష్ ఆశలు.. ఇక జూలై 17న ఐశ్వర్య రాజేష్ నటించిన ‘ఓసుకుమారి’ విడుదల కానుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సక్సెస్ అయిన ఆ క్రెడిట్ మొత్తం అనిల్ రావిపూడి, వెంకటేష్ ఖాతాలోకి వెళ్లింది. ఈ భామకు హిట్ సినిమాలో నటించాననే సంతృప్తి మాత్రమే దక్కింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ఐశ్వర్యకు తెలుగులో ఎవరు పెద్దగా అవకాశాలు ఇచ్చిన పాపానా పోలేదు. కాబట్టి ‘ఓ సుకుమారి’ మూవీ సక్సెస్ అనేది ఐశ్వర్యకు అత్యంత కీలకం అని చెప్పాలి. జూలై 24న కాజల్ అగర్వాల్ నటిస్తూన్న ప్యాన్ ఇండియా మూవీ