భాగ్యశ్రీ బోర్సే ఆస్తుల విలువ ఎంతో తెలుసా
Actor ProfileActor

భాగ్యశ్రీ బోర్సే ఆస్తుల విలువ ఎంతో తెలుసా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
భాగ్యశ్రీ బోర్సే ఆస్తుల విలువ ఎంతో తెలుసా
Zee Telugu31 Oct 2026
భాగ్యశ్రీ బోర్సే ఆస్తుల విలువ ఎంతో తెలుసా

Bhagyashri Borse Net Worth: తెలుగు సినీ పరిశ్రమలో వేగంగా గుర్తింపు తెచ్చుకుంటున్న యువ నటి భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు. వరుసగా పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా అఖిలతో ఈమె చేసిన లెనిన్ సినిమా ప్రస్తుతం మంచి విజయం సాధించింది. దీంతో ఆమె సంపాదన, ఆస్తి విలువ గురించి కూడా అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. పలు మీడియా నివేదికల ప్రకారం, భాగ్యశ్రీ బోర్సే మొత్తం ఆస్తి విలువ సుమారు రూ.2 నుంచి రూ.3 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా. అయితే ఈ సంఖ్యను ఆమె అధికారికంగా ప్రకటించలేదు. అందువల్ల ఇవి కేవలం అంచనాలు మాత్రమే.భాగ్యశ్రీ ఆదాయంలో ప్రధాన భాగం సినిమాల నుంచే వస్తోంది. ఒక్కో సినిమాకు ఆమె లక్షల్లో పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. సినిమాలతో పాటు ప్రముఖ బ్రాండ్ల ప్రకటనలు, సోషల్ మీడియా ప్రమోషన్లు కూడా ఆమెకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. మహారాష్ట్రలో జన్మించిన భాగ్యశ్రీ చిన్నతనంలో కొంతకాలం నైజీరియాలో నివసించారు. తర్వాత ముంబైకి వచ్చి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో చదువు పూర్తి చేశారు. చదువుతున్న రోజుల్లోనే మోడలింగ్ ప్రారంభించి పలు ప్రకటనల్లో నటించారు. ముఖ్యంగా ఒక ప్రముఖ చాక్లెట్ బ్రాండ్ ప్రకటనతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత హిందీ చిత్రాల్లో చిన్న పాత్రలు చేసిన భాగ్యశ్రీ, తెలుగు సినిమా 'మిస్టర్ బచ్చన్' ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన 'కింగ్‌డమ్', అఖిల్ అక్కినేనితో నటించిన 'లెనిన్' సినిమాలు ఆమెకు మరింత పేరు తీసుకొచ్చాయి. ముఖ్యంగా 'లెనిన్' సక్సెస్ మీట్‌లో అభిమానులను ఉద్దేశించి మాట్లాడినప్పుడు భాగ్యశ్రీ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. హైదరాబాద్ తన కర్మభూమి అని, తన చివరి సినిమా కూడా ఇక్కడే చేయాలని