
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక విమానం ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో అనకాపల్లి ఎంపీ సి.ఎం. రమేశ్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహా పలువురు ప్రముఖులు భోగాపురం చేరుకున్నారు. నూతన విమానాశ్రయంలో ఈ ప్రత్యేక విమానం ల్యాండ్ కావడంతో.. వాణిజ్య విమాన సర్వీసుల నిర్వహణకు విమానాశ్రయం రెడీ అన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భోగాపురం విమానాశ్రయాన్ని ఈ నెల 1న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభోత్సవం చేసి.. జాతికి అంకితం చేసిన సంగతి విదితమే. ఈ విమానాశ్రయం నుంచి ఈ నెల 17 నురంచి రెగ్యులర్ విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. అందుకు ముందస్తు సన్నాహాల్లో భాగంగనే ఈ ప్రత్యేక విమానాల రాకపోకలు జరుగుతు న్నాయి. విమానాశ్రయ నిర్వహణ సన్నద్ధతను పరిశీలించే క్రమంలో భాగంగానే ఈ ప్రత్యేక విమానం ల్యాండ్ అయింది. ఢిల్లీ నుండి బయలుదేరిన ఈ ప్రత్యేక విమానంలో ప్రజాప్రతినిధులు, పలువురు ఉన్నతాధికారులు భోగాపురం చేరుకోవడం విశేషం. ఈ రన్‌వే పరిశీలన ప్రక్రియతో ఎయిర్‌పోర్టు నుంచి వాణిజ్య విమానాల రాకపోకలు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. విమానాశ్రయం నుంచి రెగ్యులర్ విమానాల రాకపోకలు ప్రారంభం కావడానికి ముందే.. అన్ని రకాల భద్రతా ప్రమాణాలను, సాంకేతిక అంశాల పరిశీలను ఈ ప్రత్యేక విమానాన్ని ఇక్కడ ల్యాండ్ చేసినట్లు చెబుతున్నారు. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో విమాన కనెక్టివిటీ మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇ ఇదిలా ఉండగా, విమానాశ్రయా నికి ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు ఆగస్టు 15 నుంచి ఎలక్ట్రిక్ బస్సుల సేవలను కూడా ప్రారంభిం చనున్నారు. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ రాజీనామా.. ట్రంప్ సీనియర్ సలహాదారుగా కొత్త బాధ్యతలు.!