భోగాపురం ఎయిర్ పోర్ట్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం.. ప్రయాణికులకు స్పెషల్ గిప్ట్ లు
Actor ProfilePolitician

భోగాపురం ఎయిర్ పోర్ట్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం.. ప్రయాణికులకు స్పెషల్ గిప్ట్ లు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
భోగాపురం ఎయిర్ పోర్ట్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం.. ప్రయాణికులకు స్పెషల్ గిప్ట్ లు, రైతులకు ఉచితంగా విమాన
Samayam Telugu1 Jan 2027
భోగాపురం ఎయిర్ పోర్ట్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం.. ప్రయాణికులకు స్పెషల్ గిప్ట్ లు, రైతులకు ఉచితంగా విమాన

విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతరామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం సేవలు అందుబాటులోకి వచ్చాయి. భోగాపురం నుంచి ఆదివారం అర్ధరాత్రి నుంచే భోగాపురంలో సర్వీసులు ప్రారంభమయ్యాయి.. స్కూట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అర్థరాత్రి సింగపూర్‌ బయల్దేరి వెళ్లింది. ఇవాళ ఉదయం 6.45 గంటలకు ఇండిగో విమానం హైదరాబాద్‌ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చింది. ఆ తర్వాత ఉదయం 7:30 గంటలకు బెంగళూరు నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం భోగాపురం వచ్చింది. ఉదయం 8 గంటలకు మరో ఎయిరిండియా సర్వీసు భోగాపురం నుంచి బెంగళూరుకు బయల్దేరింది.ముందుగా ఉదయం 6 గంటలకు చెక్-ఇన్ హాల్‌లో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం తొలి విమానంలో వెళ్లే ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు అందిస్తారు.. ఎయిర్‌లైన్స్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అంతేకాదు తొలి విమానాల్లో వచ్చిన ప్రయాణికులకు ప్రత్యేకంగా స్వాగతం పలికి ఏటికొప్పాక బొమ్మలు, ఫస్ట్-ఫ్లైట్ సర్టిఫికెట్లతో కూడిన గూడీ బ్యాగ్‌లను గిఫ్ట్‌లుగా అందజేశారు. నేటి నుంచి తిరుపతి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాకు ఇండిగో సంస్థ 31 సర్వీసులు నడపనుంది. మొదటి రోజు 6 నుంచి 7వేల మంది ప్రయాణించనున్నారు. అంతేకాదు విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్లేవారి కోసం 20 విద్యుత్తు బస్సులు ప్రారంభమయ్యాయి.మరోవైపు భోగాపురం విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన 2,200 మంది రైతులకు ఏపీ ప్రభుత్వం అద్భుత అవకాశం కల్పించింది. వీరందరికి ఒకసారి ఉచిత విమాన ప్రయాణం చేయిస్తానని హామీ ఇచ్చారు.. ఇవాళ కొంతమంది రైతులకు విమాన ప్రయాణం కల్పించారు. ఒక విమాన సర్వీసులో 165 మంది రైతుల్ని హైదరాబాద్ పంపించనున్నట్లు తెలుస్తోంది. విడతలవారీగా రైతులందరికి విమాన ప్రయాణం కల్పిస్తారు. మరోవైపు విశాఖపట్నం నుంచి ఆదివారం విమాన సర్వీసులు ఆగిపోయాయి. ఆదివారం రాత్రి 10.45 నిమిషాలకు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి చివరి విమానం ఢిల్లీకి వెళ్లింది.. ఆ తర్వాత నుంచి కమర్షియల్ విమాన సేవలు ఆగిపోయాయి. చివరి