
బరగఢ్: బరగఢ్ జిల్లా ప్రణాళికా కమిటీ సభ్యుల ఎన్నికల్లో బీజేడీ ఘన విజయం సాధించింది. మొత్తం 15 స్థానాలను బీజేడీ అభ్యర్థులు ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నారు. ఎన్నికల అధికారి, బరగఢ్ డీఎం ఈ విషయాన్ని ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన సభ్యులకు బీజేడీ జిల్లా అధ్యక్షుడు సుశాంత్ మహాపాత్ర, పద్మపూర్ ఎమ్మెల్యే వర్షా సింగ్ బరిహా, మాజీ మంత్రులు స్నేహాంగిని ఛురియా, రీతా సాహు, మాజీ ఎమ్మెల్యే దేవేశ్ ఆచార్య తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు