
Namasthe Telangana•20 Oct 2026
బీసీ హాస్టల్ వసతి గృహంలో విద్యార్థి ఆత్మహత్యాయత్నంకామారెడ్డి : కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల కేంద్రంలో బీసీ హాస్టల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యానికి పాల్పడిన ఘటన గురువారం రోజున రాత్రి చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ పుష్పరాజు తెలిపిన వివరాల ప్రకారం.. బీసీ హాస్టల్‌లో ఉంటూ బాయ్స్ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్న కుమ్మరి రాఘవేందర్ అనే విద్యార్థి ఇటీవల వాళ్ల అత్తమ్మ చనిపోయి రెండు రోజులు అవుతుంది. కాగా అదే బాధతో రబ్బర్లతో మెడకు ఉరి వేసుకోగా వెంటనే వార్డెన్ చూసి రాఘవేందర్‌ను ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు