బాలయ్య క్రేజీ ప్రాజెక్ట్ నిలిచిపోయిందా? మొత్తానికి క్లారిటీ
Actor ProfileActor

బాలయ్య క్రేజీ ప్రాజెక్ట్ నిలిచిపోయిందా? మొత్తానికి క్లారిటీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బాలయ్య క్రేజీ ప్రాజెక్ట్ నిలిచిపోయిందా? మొత్తానికి క్లారిటీ
123Telugu8 Jan 2027
బాలయ్య క్రేజీ ప్రాజెక్ట్ నిలిచిపోయిందా? మొత్తానికి క్లారిటీ

సెన్సేషనల్ హిట్ అఖండ తర్వాత బాలయ్య మళ్ళీ వెనక్కి తిరిగి చూస్కోలేదు. ఒకదాన్ని మించి ఒకటి సాలిడ్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లోకి రావడమే కాకుండా మన సీనియర్ స్టార్ హీరోస్ లోనే బెస్ట్ లైనప్ ని బాలయ్య సెట్ చేసుకున్నారు. ఇలా బాలయ్య లైనప్ లో ఇప్పుడు స్టార్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ 112వ సినిమాగా దీనిని అత్యంత గ్రాండ్ గా అనౌన్స్ చేయగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ నిలిచిపోయింది అంటూ పలు ఊహాగానాలు టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అయ్యాయి. అయితే ఈ రూమర్స్ కి మేకర్స్ చెక్ చెప్పేసారు. సినిమా ఆగడం ఏమీ లేదని ట్రాక్ లోనే ఉందని కన్ఫర్మ్ చేశారు. సో వీరి కలయికలో సినిమాపై వస్తున్న తాజా రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. ప్రస్తుతం బాలయ్య 111వ సినిమా విషయంలో జరిగిన చిన్న గాయంతో గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత 112వ సినిమాపై ఫోకస్ పెట్టనున్నారు