
ఇంటర్నెట్‌డెస్క్: ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై, బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలెన్నో. ఇంకాస్త ప్రచారం చేసి ఉంటే, ఎక్కువమందికి చేరువయ్యేదని చాలా మంది అనుకుంటారు. ఇటీవల కాలంలో అలా వచ్చి వెళ్లిన చిత్రమే ‘బ్లాస్ట్ జోన్’ (Blast Zone). అర్జున్, ప్రీతి ముకుందన్, అభిరామి కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అలరించింది. తెలుగులో ఈ మూవీని నాగవంశీ విడుదల చేశారు. ఆయన తాజా చిత్రం ‘లెనిన్’ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో మాట్లాడారు. ‘బ్లాస్ట్ జోన్’ను (Blast movie ott) ప్రమోట్ చేయలేకపోవడానికి కారణంతో పాటు, అనేక విషయాలను పంచుకున్నారు. ‘‘బ్లాస్ట్ జోన్’ మూవీకి ప్రచారం చేసే సమయం లేదు. సరిగ్గా అప్పుడే ‘పెద్ది’ విడుదలైంది. నేను క్రాస్ ప్రమోషన్ చేస్తే, కావాలనే చేశాననే అవకాశం ఉంది. ఒకవేళ ‘పెద్ది’ విడుదల అయిన తర్వాత మొదలు పెడితే, ‘సినిమాను డ్యామేజ్ చేయడానికి మైక్ పట్టుకున్నావా’ అంటారు. పైగా ఆ చిత్ర నిర్మాత సతీశ్ కిలారు నాకు స్నేహితుడు. ఆయన బ్యానర్‌పై మొదటి సినిమా. ‘బ్లాస్ట్’ రెండు వారాల ముందు వచ్చి ఉంటే, ఇంకాస్త డబ్బులు వచ్చేవి. అయినా కూడా మంచి వసూళ్లు వచ్చాయి. ఓటీటీలోనూ మంచి టాక్‌ను తెచ్చుకుంది. రామ్‌చరణ్‌తోనూ సినిమా తీయాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నా. ఎందుకో కుదరలేదు’’ అని అన్నారు. టికెట్ రేట్లు పెరగడం వల్ల ఆడియన్స్ తగ్గలేదని, దానికన్నా పాప్ కార్న్ ధరలకు భయపడి థియేటర్‌కు ప్రేక్షకులు రావడం లేదని నాగవంశీ అన్నారు. ఇటీవల కాలంలో ప్రేక్షకులు రివ్యూలు, రేటింగ్స్ కన్నా కూడా మౌత్ టాక్‌ను బట్టి వస్తున్నారని చెప్పారు. అందుకు ఉదాహరణ ‘మా ఇంటి బంగారం’ అన్నారు. ఇలాంటి ఫ్యామిలీ జానర్ మూవీలు తీస్తే, ప్రేక్షకులు తప్పక థియేటర్‌కు వస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. పెద్ద హీరోల్లో ఒకరైనా ఏడాదికి ఒక ఎంటర్‌టైనింగ్ మూవీ తీయాలన్నారు. సిద్ధు జొన్నలగడ్డతో ఓ రూరల్ కామెడీ