
హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, యువ పారిశ్రామికవేత్త నారా బ్రాహ్మణి మరో అరుదైన జాతీయ స్థాయి గౌరవాన్ని అందుకున్నారు. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ ఇండియా ఏటా ప్రకటించే '100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్' (100 మంది అత్యంత ప్రభావశీల మహిళలు) 2026 జాబితాలో ఆమెకు చోటు దక్కింది. వ్యాపారం, పరిశ్రమలు, నాయకత్వం, సామాజిక సేవ వంటి రంగాల్లో విశేషమైన కృషి చేసి, తమదైన ముద్ర వేసిన మహిళలకు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం కల్పిస్తారు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను విజయపథంలో నడిపిస్తున్నందుకు గాను బ్రాహ్మణి ఈ గుర్తింపును పొందారు.ఈ విజయం పట్ల ఆమె భర్త, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. "ఫార్చ్యూన్ ఇండియా 100 మంది ప్రభావశీల మహిళల జాబితాలో బ్రాహ్మణి చోటు సంపాదించడం ఎంతో గర్వంగా ఉంది. ఇలాగే ముందుకు సాగుతూ మరెన్నో విజయాలు సాధించాలి. అడ్డంకులను చెరిపేస్తూ మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలి" అంటూ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా అభినందనలు తెలిపారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా తన కోడలు సాధించిన ఈ ఘనతపై ప్రత్యేకంగా స్పందించి ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ఓ పోస్ట్ చేశారు. "ఫార్చ్యూన్ ఇండియా 100 మంది శక్తిమంతమైన మహిళల జాబితాలో గుర్తింపు పొందిన బ్రాహ్మణికి హృదయపూర్వక అభినందనలు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు ఆమె నాయకత్వ పటిమ, అంకితభావం, నిబద్ధతకు నిదర్శనం" అని పేర్కొన్నారు.అంతేకాకుండా "ఆమె మా కుటుంబానికి గర్వకారణంగా నిలుస్తూనే, ఎందరో యువతులకు