
మహారాష్ట్రలోని బారామతి ఎయిర్‌పోర్టులో ఇవాళ (ఆదివారం) శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది. ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన VT-SEX విమానం శిక్షణలో భాగంగా టేకాఫ్‌కు ప్రయత్నించింది. ప్రమాదవశాత్తూ అదుపుతప్పి రన్‌వే దాటి వెళ్లిపోయింది. పుణె: మహారాష్ట్రలోని బారామతి ఎయిర్‌పోర్టులో ఇవాళ (ఆదివారం) శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది. ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన VT-SEX విమానం.. పైలట్ల శిక్షణలో భాగంగా టేకాఫ్‌కు ప్రయత్నించింది. ప్రమాదవశాత్తూ అదుపుతప్పి రన్‌వే దాటి వెళ్లిపోయింది. ఈ ఘటన మధ్యాహ్నం 12:35 గంటల సమయంలో చోటుచేసుకుంది. అయితే, విమానంలో ఉన్న కెప్టెన్ చిరాగ్ శశికాంత్ దోయ్‌ఫోడే, క్యాడెట్ అభిజీత్ జుండ్రే ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో విమానం స్వల్పంగా దెబ్బతిన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. శిక్షణలో భాగంగా విమానం టేకాఫ్‌కు ప్రయత్నించి అదుపుతప్పిందని, రన్‌వేను దాటి ముందుకు దూసుకెళ్లిందని పుణె రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ వెల్లడించారు. కాగా, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఘటన తర్వాత బారామతిలో ఇది రెండో విమాన ప్రమాదం. ఈ ఏడాది జనవరి 28న ఇదే ప్రాంతంలో జరిగిన విమాన ప్రమాదంలో అప్పటి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా ఐదుగురు మృతిచెందారు. మే 13న బారామతి ఎయిర్‌స్ట్రిప్ సమీపంలో మరో శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో విమానంలో ఉన్న శిక్షణ పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. తాజాగా అదే ప్రాంతంలో మరో ప్రమాదం జరిగింది. ఇదిలా ఉండగా.. వరుస ప్రమాదాల నేపథ్యంలో బారామతి విమానాశ్రయాన్ని ఆధునీకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) టవర్‌ను నిర్మించాలని యోచిస్తున్నారు. అలాగే రన్‌వే విస్తరణ, రాత్రివేళ విమానాల రాకపోకలకు అవసరమైన భద్రతా వ్యవస్థలు, ప్రత్యేక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారత్‌పై 100 శాతం సుంకం ఉండకపోవచ్చు: మాజీ దౌత్యవేత్త ఎయిర్‌ఇండియా ఫ్లైట్‌లో టర్బులెన్స్ ఉదంతం.. డోప్ టెస్టులో పైలట్ ఫెయిల్!