బంతుల్లో 111 రన్స్ నాటౌట్.. విరాట్ కోహ్లీ ఇచ్చిన బ్యాట్ తో ఊచకోత
Actor ProfileCelebrity

బంతుల్లో 111 రన్స్ నాటౌట్.. విరాట్ కోహ్లీ ఇచ్చిన బ్యాట్ తో ఊచకోత

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బంతుల్లో 111 రన్స్ నాటౌట్.. విరాట్ కోహ్లీ ఇచ్చిన బ్యాట్ తో ఊచకోత
TV9 Telugu7 Jan 2027
బంతుల్లో 111 రన్స్ నాటౌట్.. విరాట్ కోహ్లీ ఇచ్చిన బ్యాట్ తో ఊచకోత

DPL 2026: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో సౌత్ డెల్లీ సూపర్‌స్టార్స్ ఓపెనర్ సనత్ సాంగ్వాన్ విధ్వంసకర శతకంతో చెలరేగిపోయాడు. వెస్ట్ డెల్లీ లయన్స్ బౌలర్లను ఊచకోత కోస్తూ 16 బౌండరీలతో మైదానాన్ని హోరెత్తించాడు. విరాట్ కోహ్లీ నుంచి ప్రత్యేకంగా బ్యాట్ అందుకున్న ఈ యంగ్ సెన్సేషన్ విరుచుకుపడిన తీరు చూసి క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా సౌత్ డెల్లీ సూపర్‌స్టార్స్, వెస్ట్ డెల్లీ లయన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ ప్రేక్షకులకు అసలైన వినోదాన్ని పంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్ట్ డెల్లీ లయన్స్ 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ డెల్లీ సూపర్‌స్టార్స్ ఓపెనర్ సనత్ సాంగ్వాన్ మైదానంలో పరుగుల సునామీ సృష్టించాడు. మొదట్నుంచీ బౌలర్లపై విరుచుకుపడుతూ మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. సనత్ ధాటికి ప్రత్యర్థి బౌలర్లలో ఏ ఒక్కరూ అతడిని నిలువరించలేకపోయారు. తన ఇన్నింగ్స్‌లో సనత్ సాంగ్వాన్ కేవలం 54 బంతుల్లోనే 111 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడి బాదుడు ఏ స్థాయిలో ఉందో తెలియజేయడానికి 205.56 స్ట్రైక్ రేటే నిదర్శనం. మైదానం నలుమూలలా విరుచుకుపడుతూ ఏకంగా 10 సిక్సర్లు, 6 ఫోర్లతో మొత్తం 16 సార్లు బంతిని సరిహద్దులు దాటించాడు. మరోవైపు తన ఓపెనింగ్ పార్ట్నర్ అన్మోల్ శర్మ (38 బంతుల్లో 55 నాటౌట్) చక్కటి సహకారం అందించడంతో తొలి వికెట్‌కు 171 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఈ విధ్వంసంతో సౌత్ డెల్లీ జట్టు వికెట్ నష్టపోకుండా 15.2 ఓవర్లలోనే, అంటే మరో 28 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. ఈ యువ సంచలనం సనత్ సాంగ్వాన్‌కు టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీతో ప్రత్యేక అనుబంధం ఉంది. రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో ఢిల్లీ ఆఖరి మ్యాచ్ సందర్భంగా కోహ్లీ తన సొంత ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్‌తో పాటు పూర్తి క్రికెట్