బీజేపీకి టెన్షన్ .. బంకీపూర్ కు పీకే బంపరాఫర్
Actor ProfilePolitician

బీజేపీకి టెన్షన్ .. బంకీపూర్ కు పీకే బంపరాఫర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బీజేపీకి టెన్షన్ .. బంకీపూర్ కు పీకే బంపరాఫర్
Sakshi7 Dec 2026
బీజేపీకి టెన్షన్ .. బంకీపూర్ కు పీకే బంపరాఫర్

బీహార్‌లో మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్‌ను బద్దలు కొట్టిన ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు ఆ పార్టీకి మరో టెన్షన్ మొదలుపెట్టారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే 10 వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తానంటూ ప్రకటించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. “మీ పిల్లల సీవీలు, బయోడేటాలు పంపండి.. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తా” అంటూ ఆయన ఇచ్చిన పిలుపు.. ఓవైపు యువతలో కొత్త ఆశలు రేపుతుండగా, మరోవైపు బీజేపీకి ఇది కొత్త రాజకీయ సవాలుగా మారే అవకాశముందన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా బీజేపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ప్రాంతంలో గెలిచి.. అదే నియోజకవర్గంలో ఉద్యోగాలు, అభివృద్ధిని అజెండాగా ముందుకు తీసుకెళ్లడం కమలనాథులకు టెన్షన్ పెంచే అంశంగా మారింది. బీహార్‌లోని బంకీపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించిన ప్రశాంత్ కిషోర్.. ఆగస్టు 3న జరిగిన ఉపఎన్నికలో తనపై నమ్మకం ఉంచిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. జన సురాజ్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన.. దాదాపు మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్‌లో అనూహ్య విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. ఈ ఫలితంతో బంకీపూర్‌లో బీజేపీకి ఉన్న దాదాపు 30 ఏళ్ల ఆధిపత్యానికి బ్రేక్ పడింది. బయోడేటా పంపండి.. విజయం తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన ప్రశాంత్ కిషోర్.. తాను ప్రజలకు దూరంగా ఉన్నానంటూ వస్తున్న విమర్శలకు కూడా సమాధానం ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఐదు, ఆరు రోజులుగా నియోజకవర్గంలో కనిపించలేదని కొందరు విమర్శిస్తున్నారని, కానీ తాను ఎక్కడికీ వెళ్లడం లేదని చెప్పారు. “నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. మీ కోసం పనిచేస్తున్నాను” అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతకు సంబంధించిన కీలక ప్రకటన చేశారు. బంకీపూర్‌లో చదువుకున్నప్పటికీ ఉద్యోగాలు లేని యువత కుటుంబాలు తమ పిల్లల CVలు, బయోడేటాలను తన కార్యాలయానికి పంపాలని కోరారు. దేశవ్యాప్తంగా వివిధ