బంగ్లాదేశ్ లో బాంబు పేలుడు.. ఎన్ సీపీ ర్యాలీలో ఘోరం
Actor ProfileActor

బంగ్లాదేశ్ లో బాంబు పేలుడు.. ఎన్ సీపీ ర్యాలీలో ఘోరం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బంగ్లాదేశ్ లో బాంబు పేలుడు.. ఎన్ సీపీ ర్యాలీలో ఘోరం
Sakshi1 Oct 2026
బంగ్లాదేశ్ లో బాంబు పేలుడు.. ఎన్ సీపీ ర్యాలీలో ఘోరం

ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని సావర్ వద్ద నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్‌సీపీ) నిర్వహించిన ర్యాలీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి ఉద్యమం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నిరసన ప్రదర్శనను నిర్వహించారు. వేదికపై నుంచి ఒక పార్టీ నేత మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా స్టేజ్ సమీపంలోనే ఈ పేలుడు జరిగింది. దీంతో అక్కడున్న వారంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ ఘటనపై ఎన్‌సీపీ సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేస్తూ.. సావర్ థానా స్టాండ్ ఈద్గా మైదానంలో రాత్రి 9:45 గంటల సమయంలో ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలను అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. గాయపడిన వారికి వైద్య సహాయం అందిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనకు కొద్ది రోజుల ముందే ఢాకా సమీపంలోని కేరానిగంజ్‌లోని గ్యాస్ లైటర్ల తయారీ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న ఫైర్ సర్వీస్ సిబ్బంది ఏడు అగ్నిమాపక యంత్రాలతో గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. తిరుపతిలో ఘనంగా 'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) తిరుమల శ్రీవారి సేవలో నాగార్జున కుటుంబం (ఫొటోలు) మాల్దీవులు ట్రిప్ వేసిన హీరోహీరోయిన్ జంట (ఫొటోలు) ఎన్టీఆర్ బావమరిది కొత్త సినిమా గ్రాండ్ లాంచ్ (ఫొటోలు) అలీ ఖమేనీ అంతిమ యాత్ర.. ట్రంప్ ను హతమార్చాలి సంచలన ఆడియో లీక్ .. ఏదేమైనా.. నా భర్తను చంపే బాధ్యత నీదే.. ఎక్కడికి తీసుకెళ్తున్నారు... YSRCP శృంగరపాటి సందీప్ కుమార్ బలవంతపు అక్రమ అరెస్ట్ ప్రశ్న రావణ్ పై పవన్ కళ్యాణ్ కు ఎందుకంత కక్ష అంటే.. నేను గన్నవరంలో కేసు పెట్టాడని కారణం కూడా అదే