బిగ్ బాస్ బంపర్ ఆఫర్.. కానీ.. ఇడుపు కాయితం ఫేమ్ నాగ దుర్గ షాకింగ్ రీజన్
Actor ProfileActor

బిగ్ బాస్ బంపర్ ఆఫర్.. కానీ.. ఇడుపు కాయితం ఫేమ్ నాగ దుర్గ షాకింగ్ రీజన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బిగ్ బాస్ బంపర్ ఆఫర్.. కానీ.. ఇడుపు కాయితం ఫేమ్ నాగ దుర్గ షాకింగ్ రీజన్
TV9 Telugu28 Oct 2026
బిగ్ బాస్ బంపర్ ఆఫర్.. కానీ.. ఇడుపు కాయితం ఫేమ్ నాగ దుర్గ షాకింగ్ రీజన్

గత కొన్ని రోజులుగా నాగదుర్గ పేరు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది. ఇప్పటివరకు ఫోక్ సాంగ్స్, డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ బ్యూటీ ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుండడమే దీనికి కారణం. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు వర్క్స్ బ్యానర్లపై బలగం ఫేమ్ ప్రియదర్శి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ఇడుపు కాయితం. ఇందులో నాగ దుర్గ ‘శ్రీలత’ అనే తెలంగాణ అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్ సినిమాపై పాజిటివ్ వైబ్ ను క్రియేట్ చేశాయి. దీనికి తోడు ఇడుపు కాయితం టైటిల్ పై నెట్టింట ఓ వివాదమూ చెలరేగింది. ఈ కారణంగా కూడా... నాగదుర్గ పేరు బాగా హైలెట్ అవుతోంది. ఇప్పుడు ఈమె పేరు బిగ్ బాస్‌ కారణంగా కూడా నెట్టింట మరింత వైరల్ అవుతోంది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన నాగ దుర్గ ... తనకు కొన్ని సినిమా అవకాశాలే కాదు.. బిగ్ బాస్ ఆఫర్ కూడా వచ్చిందని చెప్పుకొచ్చింది. కానీ తనకే వెళ్లాలని లేక ఆ ఆఫర్‌ను కాదన్నట్టు తన రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ షో అంటే తనకు ఎలాంటి భయం లేనప్పటికీ... ఆ షోకు తాను సెట్టు కాలేననే ఫీలింగ్ తనలో ఉందని.. అందుకే ఆ షో ఆఫర్ ను తాను పక్కకు పెట్టినట్టు గా నాగ దుర్గ చెప్పుకొచ్చింది. తాను చాలా సైలెంట్‌ అని.. పైగా మొహమాటస్తురాలినని... ఎవరికైనా ‘నో’ చెప్పాలన్నా తనకు చాలా భయమని... తన ఫీలింగ్స్ కంటే ఎదుటివారి ఫీలింగ్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని... తనలో ఉన్న ఈ లక్షణాల వల్లే... తాను బిగ్ బాస్‌ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్టు నాగదుర్గ క్లారిటీ ఇచ్చింది. అయితే బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు... అమ్మ నీ వల్ల కాదు వద్దని వారించినా.. నాన్న మాత్ర వెళ్లమని ఎంకరేజ్ చేసినట్టు చెప్పుకొచ్చింది. Naga