బిగ్ బాస్ టీమ్ కు షాక్ ఇచ్చిన నాగార్జున
Actor ProfileCelebrity

బిగ్ బాస్ టీమ్ కు షాక్ ఇచ్చిన నాగార్జున

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బిగ్ బాస్ టీమ్ కు షాక్ ఇచ్చిన నాగార్జున, కింగ్ మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్ డిమాండ్, నిజమెంత
Asianet News Telugu8 Oct 2026
బిగ్ బాస్ టీమ్ కు షాక్ ఇచ్చిన నాగార్జున, కింగ్ మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్ డిమాండ్, నిజమెంత

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ఇప్పటికే విజయవంతంగా 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో, ఇప్పుడు 10 వ సీజన్ (Bigg Boss Season 10) లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. సీజన్ వన్ నుంచి బిగ్ బాస్ కు భారీగా రెస్పాన్స్ వస్తోంది. ఈ షోకు ఎంత మంది అభిమానులు ఉన్నారో.. అంతకంటే ఎక్కుగా బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలని పోరాడుతున్నవారు కూడా ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ షో గురించిన ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్ చల్ చేస్తోంది. హోస్ట్ కింగ్ నాగార్జున తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచి బిగ్ బాస్ టీమ్‌కు షాక్ ఇచ్చారని అంటున్నారు. నిజం ఎంత? బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 నుంచి నాగార్జున హోస్ట్ గా ఉన్నారు. మొదటి సీజన్‌ను ఎన్టీఆర్, రెండో సీజన్‌ను నాని హోస్ట్ చేయగా.. మూడో సీజన్ నుండి నాగార్జున బాధ్యతలు చేపట్టారు. ఆయన ఎంట్రీతో షో రేటింగ్స్ సరికొత్త రికార్డులను సృష్టించాయి. అప్పట్లో సీజన్ 3 కోసం నాగార్జున దాదాపు రూ. 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్ నడిచింది. మధ్యలో ఒకటి రెండు సీజన్లు సరిగ్గా నడవలేదు. నాగార్జునపై కూడా విమర్శలు వచ్చాయి. కానీ ఆతరువాత అన్నిదాటుకుని మళ్లీ బిగ్ బాస్ తెలుగు షోను ట్రాక్ ఎక్కించాడు నాగార్జున. ఆయన ఇమేజ్ కూడా ఈ షోకు బాగా ఉపయోగపడుతుంది. 66 ఏళ్ల వయసులో కూడా నాగార్జున కోసం మహిళా ప్రేక్షకులు బిగ్ బాస్ ను ఆదరిస్తున్నారు. 3 కోట్లతో మొదలై.. సీజన్ 9 వరకూ 30 కోట్ల వరకూ వచ్చాడట కింగ్ నాగార్జున. గత సీజన్ బిగ్ బాస్ కోసం ఆయన 30 కోట్లు వసూలు చేసినట్టు టాక్. కానీ ఇప్పుడు సీజన్ 10 కి వచ్చేసరికి ఆ ఫిగర్ చూసి అందరి మైండ్ బ్లాక్