బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్న మోహన్ లాల్ కూతురు మొదటి సినిమా
Actor ProfileActor

బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్న మోహన్ లాల్ కూతురు మొదటి సినిమా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్న మోహన్ లాల్ కూతురు మొదటి సినిమా
123Telugu17 Dec 2026
బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్న మోహన్ లాల్ కూతురు మొదటి సినిమా

మలయాళ సినిమా సీనియర్ స్టార్ హీరోస్ లో మోహన్ లాల్ కూడా ఒకరు. అయితే తన నట వారసులుగా కొడుకు, కూతురు ఇద్దరూ వెండితెర ఎంట్రీ ఇచ్చారు. గత ఏడాదిలోనే ఓ సాలిడ్ హారర్ చిత్రం ‘డీయస్ ఈరే’ సినిమాతో కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ అలరించగా ఈ ఏడాదిలో కూతురు విస్మయ మోహన్ లాల్ ఓ యాక్షన్ సబ్జెక్టుతో డెబ్యూ ఇచ్చి మోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబడుతున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విస్మయ మోహన్ లాల్ నటించిన ‘తుడక్కం’ చిత్రాన్ని దర్శకుడు జాడే ఆంథని జోసెఫ్ తెరకెక్కించగా ఓ యాక్షన్, సర్వైవల్ థ్రిల్లర్ గా ఈ సినిమా వచ్చింది. అయితే కేరళ సహా ఓవర్సీస్ మార్కెట్ లో ఈ చిత్రం వసూళ్లు అంతకంతకూ పెరుగుతూ వెళుతున్నట్టుగా తెలుస్తుంది. ఒక్క కేరళ నుంచే 6 రోజుల్లో 15 కోట్లు వస్తే ఓవర్సీస్ మార్కెట్ నుంచి మరో 15 కోట్ల గ్రాస్ ని ఈ సినిమా అందుకున్నట్టు తెలుస్తుంది. ఇలా మొత్తం 6 రోజుల్లో 30 కోట్లకి పైగా గ్రాస్ మోహన్ లాల్ కూతురు మొదటి సినిమాకే రావడం విశేషం. మరి రోజు రోజుకి వసూళ్లు పెంచుకుంటున్న ఈ సినిమాకి లాంగ్ రన్ లో ఎంతవరకు ప్రేక్షకులు వసూళ్లు అందిస్తారో చూడాలి