బాక్సాఫీసు దుమ్ములేపుతున్న లోకేష్ కనగరాజ్ .. డీసీ మూవీకి అదిరిపోయే వసూళ్లు
Actor ProfileActor

బాక్సాఫీసు దుమ్ములేపుతున్న లోకేష్ కనగరాజ్ .. డీసీ మూవీకి అదిరిపోయే వసూళ్లు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బాక్సాఫీసు దుమ్ములేపుతున్న లోకేష్ కనగరాజ్ .. డీసీ మూవీకి అదిరిపోయే వసూళ్లు
Asianet News Telugu24 Nov 2026
బాక్సాఫీసు దుమ్ములేపుతున్న లోకేష్ కనగరాజ్ .. డీసీ మూవీకి అదిరిపోయే వసూళ్లు

మాస్‌ దర్శకుడిగా స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు లోకేష్‌ కనగరాజ్‌. ఆయన హీరోగా మారి `డీసీ` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ దీనికి దర్శకుడు కావడం విశేషం. ఈ చిత్రంలో వామికా గబ్బి, సంజన లాంటి వాళ్లు ముఖ్య పాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు. అరుణ్ మాథేశ్వరన్ గత సినిమాల్లోని మేకింగ్ స్టైల్ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే, లోకేష్ కనగరాజ్ కూడా డైరెక్టర్‌గా ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చారు. ఇలాంటి ఇద్దరు తోపులు కలవడంతో పాటు, లోకేష్ మొదటిసారి హీరోగా నటించడంతో 'DC' సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. సినిమా రిలీజ్ అయ్యాక, అరుణ్ మాథేశ్వరన్ మార్క్ రా మేకింగ్ ఇందులో ఉన్నప్పటికీ, కథాంశం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తల్లిదండ్రుల సపోర్ట్ లేకుండా పెరిగే పిల్లల జీవితాలు, చదువు ప్రాముఖ్యత వంటి విషయాలను కథతో ముడిపెట్టి చెప్పిన తీరుకి ప్రశంసలు వస్తున్నాయి. డైరెక్టర్‌గా అందరికీ తెలిసిన లోకేష్, హీరోగా ఎలా ఉంటాడో అనే డౌట్ సినిమాకు ముందు అందరిలోనూ ఉండేది. కానీ, సినిమా చూశాక ఆయన నటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా, అనుభవం ఉన్న నటులతో కలిసి నటించిన సీన్లలో కూడా లోకేష్ తన పాత్రను అద్భుతంగా పోషించాడని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో, భవిష్యత్తులో లోకేష్ నటనపై కూడా ఫోకస్ పెడతాడేమో అనే ఆసక్తి మొదలైంది. సినిమా మేకింగ్, యాక్టింగ్, మ్యూజిక్ ఇలా అన్నింటికీ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే, 'DC' సినిమా కలెక్షన్ల వివరాలు కూడా బయటకు వచ్చాయి. ప్రముఖ ట్రేడ్ సంస్థ సాక్నిల్క్ (Sacnilk) ప్రకారం, ఈ సినిమా మూడో రోజు సుమారు రూ.9.55 కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది. మొదటి రెండు రోజుల్లో సుమారు రూ.11 కోట్లు రాబట్టినట్లు