బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్.. కేవలం రూపాయికే సిమ్
Actor ProfilePolitician

బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్.. కేవలం రూపాయికే సిమ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్.. కేవలం రూపాయికే సిమ్, ఉచిత కాల్స్
AP7AM17 Dec 2026
బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్.. కేవలం రూపాయికే సిమ్, ఉచిత కాల్స్

80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కొత్త కస్టమర్ల కోసం కేవలం ఒక్క రూపాయికే 'ఫ్రీడమ్ ప్లాన్'ను తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ కింద ఉచిత సిమ్‌ కార్డుతో పాటు, 24 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 1 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తాయి.ఈ ఆఫర్ కేవలం కొత్తగా బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుత వినియోగదారులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండదు. ఈ పరిమిత కాల ఆఫర్ 2026 సెప్టెంబర్ 12 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆసక్తి గలవారు బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా అధీకృత రిటైలర్లను సంప్రదించి, కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా కనెక్షన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.గతేడాది కూడా బీఎస్ఎన్ఎల్ 'ఆజాదీ కా ప్లాన్' పేరుతో ఇటువంటి ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. అప్పట్లో 30 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 2 జీబీ డేటాను అందించింది. అయితే, ఈసారి 'ఫ్రీడమ్ 2.0' వెర్షన్‌లో వ్యాలిడిటీతో పాటు రోజువారీ డేటా పరిమితిని కూడా తగ్గించింది.ఇదే స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్‌లో భాగంగా, బీఎస్ఎన్ఎల్ తన రూ. 2,399 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా అప్‌గ్రేడ్ చేసింది. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 12 మధ్య ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే వారికి 47 రోజుల అదనపు వ్యాలిడిటీ లభిస్తుంది. దీంతో మొత్తం వ్యాలిడిటీ 412 (365+47)