
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Ktr fires on cm revanth reddy govt: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం కాకరేపుతున్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం నడుస్తొంది. ఈ క్రమంలో గత పాలకుల వల్లే తెలంగాణ అప్పులు కూపంగా మారిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది. మరోవైపు పాలన చాతకక తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ కౌంటర్ లు ఇస్తుంది. ఈ క్రమంలో తాజాగా.. కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంను ఏకీపారేశారు. మల్లాపూర్‌లో జరిగిన హమాలీ యూనియన్ మహాసభలో కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పాలనపై నిప్పులు చెరిగారు. రైతులకు తమ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. మీరు వడ్ల బస్తాలు మోసి కష్టపడ్డారని రైతుల గురించి మాట్లాడారు. మరోవైపు సీఎం రేవంత్ కూడా సంచులు మోస్తు కష్టపడుతున్నాడని కానీ ఆయన ఏం సంచులు మోస్తున్నాడో, ఎక్కడకు వెళ్తున్నాడో నాకంటే మీకు బాగా తెలుసని సెటైర్లు వేశారు. ఢిల్లీలో ఉన్న పెద్దల కోసం డబ్బుల మూటలు మోసి మోసి తను కష్టపడుతున్నట్లు సీఎం రేవంత్ భావిస్తున్నాడని ఎద్దేవా చేశారు కన్నెపల్లి వద్ద రెండు పంపులు స్టార్ట్ చేస్తే తెలంగాణ మొత్తం సుభిక్షం అవుతుందని చెప్పిన రేవంత్ సర్కారు పట్టించుకొవడంలేదన్నారు. బీఆర్ఎస్ ను బద్నామ్ చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుకోవడం జరిగిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ఈ గొడవ అంతా ఎందుకని నీళ్లే ఇవ్వకపోతే ఏ గొడవ ఉండదని, ఇవాళ నీళ్లు ఉండి కూడా పంటలను ఎండబెడుతున్నాడని, రైతులను అరిగోస పెడుతున్నాడంటూ మండిపడ్డారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి