ఫస్ట్ డేని మించి సెకండ్ డే కలెక్షన్ల సునామీ... సూర్య కెరీర్ లో విశ్వనాథ్ అండ్ సన్స్’ రేర్
Actor ProfileActor

ఫస్ట్ డేని మించి సెకండ్ డే కలెక్షన్ల సునామీ... సూర్య కెరీర్ లో విశ్వనాథ్ అండ్ సన్స్’ రేర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఫస్ట్ డేని మించి సెకండ్ డే కలెక్షన్ల సునామీ... సూర్య కెరీర్ లో విశ్వనాథ్ అండ్ సన్స్’ రేర్
Samayam Telugu29 Dec 2026
ఫస్ట్ డేని మించి సెకండ్ డే కలెక్షన్ల సునామీ... సూర్య కెరీర్ లో విశ్వనాథ్ అండ్ సన్స్’ రేర్

సౌతిండియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న కోలీవుడ్ వర్సలైట్ యాక్టర్ సూర్య నటించిన బైలింగ్వల్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ దూసుకుపోతోంది. తెలుగులో వరుస హిట్లతో జోరుమీదున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మమితా బైజు కథానాయికగా నటించిన ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, రవీనా టండన్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. వినోదం, సున్నితమైన కుటుంబ భావోద్వేగాల కలయికతో రూపొందిన ఈ చిత్రం మొదటి ఆట నుంచే విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. చాలాకాలం తర్వాత సూర్య ఒక ఆహ్లాదకరమైన ఫ్యామిలీ డ్రామాలో కనిపించడం, వెంకీ అట్లూరి మార్క్ ఎమోషన్స్ వర్కవుట్ అవ్వడంతో చిత్రానికి పాజిటివ్ టాక్ లభిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.* సంక్రాంతి బ్లాక్‌బస్టర్ లోడింగ్... లీవ్స్, హాలిడేస్ లేకుండా ర్యాంప్ ఆడేస్తున్న అనిల్ రావిపూడిబాక్సాఫీస్ వద్ద ఈ సినిమా తన సత్తా చాటుతోంది. మొదటి రోజు కంటే రెండో రోజు వసూళ్లలో అనూహ్యమైన వృద్ధి కనిపించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లోనే ఈ చిత్రం సుమారు రూ. 74.47 కోట్ల గ్రాస్ రాబట్టి ప్రభంజనం సృష్టించింది. ఇండియాలో మొదటి రోజు రూ. 17.74 కోట్లు వసూలు చేయగా, రెండో రోజు మరింత పుంజుకుని ఏకంగా రూ. 25 కోట్లకు పైగా కొల్లగొట్టింది. మొత్తంగా ఇండియా వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 43.47 కోట్ల గ్రాస్ (సుమారు రూ. 37.60 కోట్ల నెట్) నమోదు చేసింది. ప్రాంతాల వారీగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో (ఏపీ, తెలంగాణ) రూ. 17 కోట్లు, తమిళనాడులో రూ. 18 కోట్లు, కర్ణాటకలో రూ. 5 కోట్లు, కేరళలో రూ. 3.50 కోట్లు సాధించి సాలిడ్ హోల్డ్ కనబరిచింది.* లక్షలాది మంది ఆకలి తీర్చిన ‘ఎన్టీఆర్ మీల్’ సర్వీస్ బంద్ఓవర్సీస్‌లో