
బాలానగర్‌లోని ఫతేనగర్‌లో భారీ డ్రగ్స్ రాకెట్‌ను ఈగల్ ఫోర్స్ టీం శుక్రవారం బట్టబయలు చేసింది. స్థానికంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ఆకాష్ అనే వ్యక్తిని ఈ టీం అరెస్ట్ చేసింది. హైదరాబాద్, జులై 10: బాలానగర్‌లోని ఫతేనగర్‌లో భారీ డ్రగ్స్ రాకెట్‌ను ఈగల్ ఫోర్స్ టీం శుక్రవారం బట్టబయలు చేసింది. స్థానికంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ఆకాష్ అనే వ్యక్తిని ఈ టీం అరెస్ట్ చేసింది. అతడి ద్వారా మరో 29 మంది గంజాయి వినియోగదారులను అదుపులోకి తీసుకుంది. వీరందరికీ డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. దీంతో వారందరికీ పాజిటివ్ వచ్చింది. అలాగే 29 మంది నుంచి 17.8 గ్రాముల గంజాయిని ఈగల్ ఫోర్స్ టీం స్వాధీనం చేసుకుంది. రూ.500కు 5 గ్రాముల చొప్పున ఈ ముఠా గంజాయి విక్రయిస్తున్నట్లు విచారణలో గుర్తించింది. పట్టుబడిన వారిలో 11 మంది సింగిల్ పేరెంట్ పిల్లలు కాగా మరో ముగ్గురు అనాథలు అని ఈ టీం వివరించింది. అలాగే ఫతేనగర్, ధూల్‌పేట్, నానక్‌రామ్‌గూడ ప్రధాన గంజాయి సరఫరా కేంద్రాలుగా ఉన్నాయని ఈ విచారణలో గుర్తించారు. వీరిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే గంజాయి ప్యాకెట్లు విక్రయిస్తున్న 78 ఏళ్ల చంద్రమ్మ పరారీ ఉంది. ఇక పలువురు పరారీలో ఉన్నారని.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఈగల్ టీం వివరించింది. డ్రగ్స్‌పై జీరో టాలరెన్స్ కోసం హాట్‌స్పాట్లలో ఆకస్మిక దాడులు కొనసాగుతాయని ఈగల్ ఫోర్స్ స్పష్టం చేసింది. డ్రగ్స్ విక్రయంపై ఈ రోజు ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1908కు ఫిర్యాదు వచ్చింది. దీంతో ఈగల్ టీం ఈ ఆపరేషన్ చేపట్టింది. సోషల్ మీడియా దుర్వినియోగంపై కేబినెట్ సీరియస్.. కఠిన చట్టాలకు సీఎం ఆదేశం: మంత్రి పార్థసారథి గేట్ కీపర్ సాహసానికి నెటిజన్ల సెల్యూట్.. షాకింగ్ ఘటన!