ఫడ్నవీస్ ను కాదని షిండేతో భేటీ దేనికి
Actor ProfilePolitician

ఫడ్నవీస్ ను కాదని షిండేతో భేటీ దేనికి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఫడ్నవీస్ ను కాదని షిండేతో భేటీ దేనికి
Sakshi14 Oct 2026
ఫడ్నవీస్ ను కాదని షిండేతో భేటీ దేనికి

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌.. ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేను కలవడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. సాధారణ మర్యాదపూర్వక భేటీగానే ఇరు వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఈ సమావేశం జరిగిన సమయం, కలిసిన నేతల ప్రాధాన్యం రాజకీయ చర్చలకు దారితీస్తోంది. మహారాష్ట్ర–కర్ణాటక సరిహద్దు వివాదంపై ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు శరద్‌ పవార్‌ బుధవారం అసెంబ్లీకి వచ్చారు. సమావేశం ముగిసిన అనంతరం ఆయన నేరుగా ఏక్‌నాథ్‌ షిండే ఛాంబర్‌కు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన వెంట ఎన్సీపీ (ఎస్పీ) నేతలు జయంత్‌ పాటిల్‌, జితేంద్ర అవ్హాద్‌, శశికాంత్‌ షిండే కూడా ఉన్నారు. ఆ సమయంలో షిండే క్యాబినెట్‌ సమావేశంలో ఉన్నారు. పవార్‌ వచ్చిన విషయం తెలుసుకున్న షిండే సమావేశం నుంచి బయటకు వచ్చి ఆయనను కలిశారు. ఇద్దరు నేతలు దాదాపు 15 నిమిషాల పాటు చర్చలు జరిపారు. అనంతరం షిండే తిరిగి క్యాబినెట్‌ సమావేశానికి వెళ్లగా.. పవార్‌ కొంతసేపు తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అసలు చర్చంతా ఫడ్నవీస్‌ చుట్టూనే.. ఈ భేటీలో ఆసక్తిని పెంచిన అంశం ఒక్కటే కాదు. మహారాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ కీలక నిర్ణయాధికారిగా ఉన్నప్పటికీ.. పవార్‌ ఆయనను కాకుండా షిండేను కలవడం రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షించింది. అయితే దీన్ని కేవలం ఫడ్నవీస్‌ను పక్కన పెట్టిన చర్యగా చూడలేమని విశ్లేషకులు చెబుతున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో షిండేకు ఉన్న ప్రత్యేక రాజకీయ స్థానం ఈ భేటీకి కారణంగా కనిపిస్తోంది. శివసేనలో చీలిక తర్వాత షిండే వర్గం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా మారింది. ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వంలోని శివసేన నుంచి పలువురు నేతలు షిండే శిబిరంలోకి వెళ్లడం, ఇటీవల ఆ వర్గంలో చోటుచేసుకున్న పరిణామాలు.. షిండేను ఒక ప్రత్యేక రాజకీయ కేంద్రంగా నిలిపాయి. షిండే ఎందుకు కీలకం? శరద్‌ పవార్‌కు మహారాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉంది