ఫిలడెల్ఫియాలో పద్మశ్రీ’ అవార్డు గ్రహీత నటుడు రాజేంద్ర ప్రసాద్ కు ఘన సన్మానం
Actor ProfilePolitician

ఫిలడెల్ఫియాలో పద్మశ్రీ’ అవార్డు గ్రహీత నటుడు రాజేంద్ర ప్రసాద్ కు ఘన సన్మానం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఫిలడెల్ఫియాలో పద్మశ్రీ’ అవార్డు గ్రహీత నటుడు రాజేంద్ర ప్రసాద్ కు ఘన సన్మానం
Andhra Jyothy11 Dec 2026
ఫిలడెల్ఫియాలో పద్మశ్రీ’ అవార్డు గ్రహీత నటుడు రాజేంద్ర ప్రసాద్ కు ఘన సన్మానం

ఫిలడెల్ఫియా తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో ‘నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌కు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఆదివారం(ఆగస్టు 9వ తేదీన) పెన్సిల్వేనియాలోని చెస్టర్ స్ప్రింగ్స్ ‘బైయర్స్ స్టేషన్ క్లబ్ హౌస్’లో అత్యంత వైభవంగా జరిగింది. ఇంటర్నెట్ డెస్క్: ఫిలడెల్ఫియా తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో ‘నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌కు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఆదివారం(ఆగస్టు 9వ తేదీన) పెన్సిల్వేనియాలోని చెస్టర్ స్ప్రింగ్స్ ‘బైయర్స్ స్టేషన్ క్లబ్ హౌస్(Byers Station Club House)’లో అత్యంత వైభవంగా జరిగింది. భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న సందర్భంగా రాజేంద్ర ప్రసాద్‌ను గౌరవించుకోవడానికి రవి పొట్లూరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో తెలుగువారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చిత్రపరిశ్రమలో దాదాపు 49 ఏళ్లుగా విలక్షణమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రాజేంద్ర ప్రసాద్ సినీ ప్రయాణాన్ని, సేవలను సభలో కొనియాడారు. హాస్యరస చిత్రాలతో పాటు ఎన్నో ఉత్తమ పాత్రలతో అలరించిన ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం తెలుగుజాతికే గర్వకారణమని హాజరైన తెలుగు సంఘాల ప్రతినిధులు, అభిమానులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ నిర్వహిస్తున్న ‘ఛారిటబుల్ ట్రస్ట్(Charitable Trust)’కు ఎనిమిది లక్షల రూపాయల విరాళం అందించారు. తమ పూర్తి మద్దతు, సహకారం ఎల్లప్పుడూ ఉంటాయని ఫిలడెల్ఫియా తెలుగు ప్రజలు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమ్యూనిటీ సభ్యులు ఆయనతో జ్ఞాపకాలను పంచుకుని, దుశ్శాలువాలు, పూలమాలలు, జ్ఞాపికలతో రాజేంద్ర ప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రవాస తెలుగు ప్రజలు తనపై చూపిస్తున్న ఆప్యాయతకు, ప్రేమానురాగాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సముద్రాలు దాటి వచ్చినా, ప్రవాసాంధ్రులు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే కన్నతల్లి ఒడిలో ఉన్నట్లే ఉంది. మీ ప్రేమే నన్ను ఇన్నేళ్లుగా నటుడిగా ముందుకు నడిపిస్తోంది అని పేర్కొన్నారు. ఈ 'పద్మశ్రీ' పురస్కారం తనకు లభించిన గౌరవం మాత్రమే కాదని, తనను ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ చెందుతుందని