
ఈ నెలాఖరులోపల మీరందరూ మీ మీ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేయాలి. అంటే గడువు తేదీ 2026 జూలై 31. ఆన్‌లైన్‌లో వేయాలంటే ఆ రోజు అర్ధరాత్రి 12 గంటల లోపల ఫైల్ చేయాలి. గతంలో ఎన్నోసార్లు రిటర్ను వేయడానికి కావాల్సిన సమాచారం గురించి, కాగితాలు-డాక్యుమెంట్ల ఆవశ్యకత గురించి మనం తెలుసుకున్నాం. రంగంలోకి దిగే ముందు మీకు మూడు ఆప్షన్లు ఉంటాయి. అవేంటంటే.. మొదటిది.. మీ రిటర్ను మీరే దాఖలు చేసుకోవచ్చు. మీ కేసు ట్యాక్స్ ఆడిట్ కాకపోతే మీ వ్యవహారాలకు ఎటువంటి ఆడిట్ అక్కర్లేదు. ఆడిట్ రిపోర్టు ప్రశ్న ఉండదు. పాత చట్టం ప్రకారం ఫారం 16, 16ఏ, ఫారం 26ఏఎస్ .. మొదలైన క్యాపిటల్ గెయిన్స్ స్టేట్‌మెంట్, ఇతర సర్టిఫికెట్లు, రెడీగా పెట్టుకోండి. కరెక్ట్ ఫారం ఎంచుకోండి. లాగిన్ అవ్వండి. ఇది ప్రీ-ఫిల్డ్ ఫారం. మీరు ఓపెన్ చేయగానే ‘సమాచారం’ అప్పటికే నింపి ఉంటుంది. అది కరెక్ట్ అయితే ఓకే.. లేదా విభేదించి కరెక్టు సమాచారం నింపుతూ వెళ్లండి. రిటర్న్ ఫైలింగ్ సాఫీగా జరిగిపోవచ్చు. మీకు ఖర్చులేమీ ఉండవు. అంతా మీ చేతిలోనే.. ఫారం 1 వరకు ఫర్వాలేదు. రెండోది. ఇన్‌కంట్యాక్స్ ప్రాక్టీషనర్ల దగ్గరికి వెళ్తే వారు మీ తరఫున పోర్టల్‌లోకి వెళ్లి, లాగిన్ చేసి, మీరు చేయవలసినవన్నీ చకచకా చేసేస్తారు. ఫీజులు తక్కువగా ఉంటాయి. ఫారం 1, ఫారం 2 వరకు బాగానే ఫైలింగ్ చేస్తారు. మూడో కేటగిరీ.. వృత్తి నిపుణులు.. అంటే.. సీఏలు, కాస్ట్ అకౌంటెంట్లు, కొంత మంది కంపెనీ సెక్రటరీలు, సీనియర్ లాయర్లు.. వీరు కూడా మీ తరఫున మీ ఆదాయపు పన్ను రిటర్నులు వేస్తారు. వీరికి సబ్జెక్టు మీద పట్టు, ప్రతిభా పాటవాలు, అనుభవం, అవగాహన విశ్లేషణ సామర్థ్యాలు విశేషంగా ఉంటాయి. ఉన్న నాలుగు అంకెలను నాలుగు కాలమ్‌లలో వేసి, మమ అనిపించి ఒక అక్నాలెడ్జ్‌మెంట్ తేవడమనేది రిటర్ను వేయడం కాదు.. ఓ కాగితాన్ని