
UPI AutoPay Mandate | యాప్‌లో కొత్త ఫీచర్ వచ్చింది.. నెల రోజులు ఫ్రీ ట్రయల్.. ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. మా ఓటీటీలో కొత్తగా యాడ్‌ఫ్రీ సేవలు తీసుకొచ్చాం.. ఓ రెండు నెలలు ఉచితంగా వాడాక పేమెంట్ చేయండి.. అంటూ రకరకాల సేవలు మనల్ని ఊరిస్తుంటాయి. చాలా కంపెనీలు తమ ప్రీమియం సేవలవైపు యూజర్లను ఆకర్షించేందుకు వేసే ఎత్తుగడే ఈ ఫ్రీ ట్రయల్. ఎలాగూ ఉచితమేగానని చాలామంది సబ్‌స్క్రైబ్ అవుతుంటారు. ప్రీమియం సేవల కోసమే తీసుకునే వారికి.. ఈ ఫ్రీ ట్రయల్ ఓ విధంగా కలిసొచ్చినట్లే. కానీ, ఉచితకాలం ముగిశాక ఆపేద్దామనుకున్న వారు మాత్రం ఇరుక్కుపోతుంటారు. సబ్‌స్క్రైబ్ చేసుకున్నాక చాలా మంది దాని సంగతి మరిచిపోతుంటారు. తీరా బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యాక నాలుక కరుచుకుంటారు. మరికొందరు మాత్రం ఫ్రీ ట్రయల్ రద్దు చేయడం తెలీక తాము వాడని సేవలకూ నెల నెలా డబ్బులు చెల్లిస్తుంటారు. దీనివల్ల నగదు కోల్పోవడమే కాదు.. అకౌంట్‌లో డబ్బులు లేకపోతే ఆటోపే మ్యాండేట్ ఫెయిల్ అయి బ్యాంకులు అపరాధ రుసుం విధించొచ్చు. దీనివల్ల క్రెడిట్ స్కోరుపైనా ప్రభావం పడుతుంది. చాలా మంది దగ్గర తమ స్మార్ట్‌ఫోన్లలో ఒకటికి మించి యూపీఐ యాప్స్ ఉంటాయి. ఏదైనా ఫ్రీ ట్రయల్‌కు సబ్‌స్క్రైబ్ అయినప్పుడు ఏదో ఒక యాప్ నుంచి ఆటో డెబిట్‌కు అంగీకారం తెలుపుతూ అనుమతి ఇచ్చేస్తుంటారు. రెండు మూడుకు మించి ఇలాంటి అనుమతులు ఇచ్చినప్పుడు ఏ యాప్‌లో ఏది ఉందో తెలుసుకోవడమూ కష్టమే. అలాంటి వారి కోసమే ఒక మొబైల్ నంబర్‌పై ఎన్ని మ్యాండేట్‌లు ఉన్నాయో తెలుసుకోవడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఓ సదుపాయం కల్పిస్తోంది. వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ మొబైల్ నంబర్‌పై ఎన్ని ఆటోపేకి అనుమతులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వగానే అన్నీ ఒకే చోట దర్శనమిస్తాయి. కావాలంటే అక్కడే పాజ్ చేయొచ్చు. లేదంటే పూర్తిగా క్యాన్సిల్ చేయొచ్చు. యాప్‌లోనూ రద్దు