
ఈ రోజుల్లో ఒక స్టార్ హీరోతో సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు.. అది నిజంగా కత్తి మీద సామే. సినిమా రిజల్ట్ కొంచెం అటు ఇటు అయినా, ఫ్లాప్ పడినా సోషల్ మీడియాలో వచ్చే హేట్ రేట్, నెగెటివిటీని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఈ రోజుల్లో ఒక స్టార్ హీరోతో సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు.. అది నిజంగా కత్తి మీద సామే. సినిమా రిజల్ట్ కొంచెం అటు ఇటు అయినా, ఫ్లాప్ పడినా సోషల్ మీడియాలో వచ్చే హేట్ రేట్, నెగెటివిటీని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఇక హీరో పుట్టినరోజు వస్తుందంటే చాలు.. ఫ్యాన్స్ కంటే ముందే దర్శకులు, నిర్మాతలు తీవ్రమైన టెన్షన్‌లో పడిపోతుంటారు. తమ అభిమాన హీరోను ఎలివేట్ చేసేలా ఒక టీజరో, గ్లింప్సో రిలీజ్ చేయాలి.. లేదంటే ఫ్యాన్స్ నుంచి వచ్చే ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్స్ ఊహించడం కూడా కష్టమే. కానీ.. వీటన్నింటినీ ఎంతో కూల్‌గా, తనదైన స్టైల్లో హ్యాండిల్ చేసే ఒక్కే ఒక్క దర్శకుడు ఎవరయ్యా అంటే జక్కన్న రాజమౌళినే అని చెప్పాలి. ఫ్యాన్స్ ఎంత ప్రెషర్ పెట్టినా, ఇండస్ట్రీ ఎంత ఆత్రుతగా ఎదురుచూసినా.. తన టైమ్ వచ్చే వరకు రాజమౌళి (SS Rajamouli) అస్సలు తగ్గడు. సాధారణంగా స్టార్ హీరోలను కష్టపెట్టడానికి వేరే దర్శకులు కాస్త జంకుతారేమో కానీ, జక్కన్న నిఘంటువులో మొహమాటం అనే మాటే ఉండదు. తనకు కావాల్సిన పర్ఫెక్ట్ అవుట్‌పుట్ వచ్చేంత వరకు.. ఆ హీరోల రక్తం పిండేస్తుంటారు. ఇది వేరే ఎవరో చెప్పిన మాటలు కావు.. రాజమౌళితో సినిమాలు చేసిన హీరోలే స్వయంగా ఒప్పుకున్న సత్యం. అయితే, రాజమౌళి పెట్టిన కష్టానికి ప్రతిఫలంగా ఆ హీరోలకు వారి కెరీర్‌లోనే మైండ్ బ్లాక్ అయ్యే బ్లాక్‌బస్టర్ హిట్స్‌ను గిఫ్ట్‌గా ఇస్తాడు. ప్రభాస్, రామ్‌చరణ్, ఎన్టీఆర్.. ఇలా అందరూ జక్కన్న చెక్కిన శిల్పాలే, బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ