ఫామ్ హౌస్ లో కాదు.. అసెంబ్లీలోకి రా.. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్
Actor ProfilePolitician

ఫామ్ హౌస్ లో కాదు.. అసెంబ్లీలోకి రా.. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఫామ్ హౌస్ లో కాదు.. అసెంబ్లీలోకి రా.. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్
AP7AM24 Dec 2026
ఫామ్ హౌస్ లో కాదు.. అసెంబ్లీలోకి రా.. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి బహిరంగ సవాల్‌ విసిరారు. రైతుల కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన మేలు, బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అన్యాయాలపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని అన్నారు. ఫామ్‌హౌస్‌లో ఉండి విమర్శలు చేయడం కాదని, ప్రజల ముందుకు వచ్చి మాట్లాడాలని అన్నారు. సంగారెడ్డిలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.గతంలో వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్‌ తన ఫామ్‌హౌస్‌లో మాత్రం వరి పండించారని రేవంత్‌ విమర్శించారు. ఇప్పుడు రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతుంటే బీఆర్‌ఎస్‌ విమర్శలు చేస్తోందన్నారు. రైతుల సంక్షేమంపై నిజమైన చర్చకు సిద్ధమైతే అసెంబ్లీ వేదికగా మాట్లాడుకుందామని సవాల్‌ చేశారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని రేవంత్‌ అన్నారు. ఈ రెండు పార్టీలు ఒకే నాణేనికి బొమ్మా బొరుసులాంటివని వ్యాఖ్యానించారు. పదేళ్లు అధికారంలో ఉన్నా పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు.కాంగ్రెస్‌ వస్తే కరెంట్‌ కోతలు వస్తాయని గతంలో బీఆర్‌ఎస్‌ ప్రచారం చేసిందని, కానీ ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు లేవని రేవంత్‌ చెప్పారు. రైతు భరోసా పథకం కింద 32 నెలల్లో రూ.36 వేల కోట్లు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నివేదికల ప్రకారం దేశంలో తక్కువ అప్పులు ఉన్న రైతులు తెలంగాణలోనే ఉన్నారని అన్నారు. బీజేపీ నేతలు ఆ నివేదికలు చదివితే నిజాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు.స్మార్ట్‌ రేషన్‌ కార్డులు కేవలం