ఫిఫా క్వార్టర్ ఫైనల్స్ కు అంతా రెడీ .. టైటిల్ పోరుకు సర్వం సిద్ధం
Actor ProfileCelebrity

ఫిఫా క్వార్టర్ ఫైనల్స్ కు అంతా రెడీ .. టైటిల్ పోరుకు సర్వం సిద్ధం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఫిఫా క్వార్టర్ ఫైనల్స్ కు అంతా రెడీ .. టైటిల్ పోరుకు సర్వం సిద్ధం
Zee Telugu16 Oct 2026
ఫిఫా క్వార్టర్ ఫైనల్స్ కు అంతా రెడీ .. టైటిల్ పోరుకు సర్వం సిద్ధం

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. FIFA Quarter Final: అవును ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో క్వార్టర్ ఫైనల్‌కు అంతా సిద్ధమైంది. ఇక టోర్నీ లీగ్ ద‌శలో 48 జ‌ట్లు పోటీప‌డ్డాయి. వాటిలో 32 టీమ్స్‌ రౌండ్ ఆఫ్ 32కు చేరాయి. అక్కడి నుంచి నాకౌట్‌ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ మ్యాచ్‌ల నుంచి 16 టీమ్స్‌ ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాయి. అక్కడ నుంచి 8 జట్లు క్వార్టర్స్‌కు చేరుకున్నాయి. అందులోంచి 4 టీమ్‌లు సెమీస్‌కు అర్హత సాధించనున్నాయి. ఫైనల్‌లో రెండు టీమ్‌లు పోటీ పడతాయి. అందులో ఎవరు విజేతలుగా నిలుస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇవాళ అర్థరాత్రి తొలి క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఫ్రాన్స్, మొరాకోల మధ్య జరుగుతుంది. ఇక రేపు రెండో క్వార్టర్‌ ఫైనల్‌‌లో స్పెయిన్, బెల్జియంల మధ్య జరుగనుంది. 3వ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ నార్వే , ఇంగ్లండ్‌ ల మధ్య జూలై 12 జరుగుతుంది. ఇక ఆఖరి 4వ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ అర్జెంటీనా స్విట్జ‌ర్లాండ్‌ ల మధ్య అదే రోజు జరుగుతుంది. భారీ అంచ‌నాలు పెట్టుకున్న పెద్ద జట్లలో చాలా వ‌ర‌కు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. జ‌ర్మనీ, పోర్చుగ‌ల్‌, నెద‌ర్లాండ్స్‌, క్రొయేషియా లాంటి టీమ్లు ప్రిక్వార్టర్స్‌లో నుంచే వెనుతిరిగాయి. డిఫెండింగ్ చాంపియ‌న్ హోదాలో బ‌రిలోకి దిగిన అర్జెంటీనా త‌మ స్థాయికి త‌గ్గట్లే వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది. అర్జెంటీనా స్టార్ ప్లేయర్‌ లియోన‌ల్ మెస్సీ 5 మ్యాచ్‌ల్లో 8 గోల్స్‌, ఒక అసిస్ట్‌తో గోల్డెన్ బూట్ రేసులో అగ్రస్థానంలో