ఫోనే నరకం చూపించింది'.. కదలలేని స్థితిలో న టి షకీలా.. రూ. 3 లక్షలతో మెడకు ఆపరేషన్
Actor ProfilePolitician

ఫోనే నరకం చూపించింది'.. కదలలేని స్థితిలో న టి షకీలా.. రూ. 3 లక్షలతో మెడకు ఆపరేషన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఫోనే నరకం చూపించింది'.. కదలలేని స్థితిలో న టి షకీలా.. రూ. 3 లక్షలతో మెడకు ఆపరేషన్
AP7AM15 Dec 2026
ఫోనే నరకం చూపించింది'.. కదలలేని స్థితిలో న టి షకీలా.. రూ. 3 లక్షలతో మెడకు ఆపరేషన్

గంటల తరబడి స్మార్ట్‌ఫోన్‌కు అతుక్కుపోవడం ఎంత ప్రమాదకరమో చెప్పడానికి సీనియర్ నటి షకీలా ఉదంతం ఒక హెచ్చరికగా నిలుస్తోంది. ఫోన్ వ్యసనం కారణంగా తీవ్రమైన నరాల సమస్య బారిన పడిన ఆమె, ఇటీవల మెడకు అత్యవసర శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ చేదు అనుభవాన్ని ఆమె స్వయంగా వెల్లడిస్తూ, స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను అప్రమత్తం చేశారు.గత కొంతకాలంగా తాను మంచంపై తప్పుడు భంగిమలో పడుకుని గంటల తరబడి ఫోన్‌లో రీల్స్ చూడటం, గేమ్స్ ఆడటమే అలవాటుగా మార్చుకున్నానని షకీలా తెలిపారు. కేవలం టీ, కాఫీ తాగేందుకు మాత్రమే విరామం తీసుకుని, మిగతా సమయమంతా ఫోన్‌తోనే గడిపానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దురలవాటు కారణంగా మెడలోని ప్రధాన నరాలపై తీవ్ర ఒత్తిడి పడి, సమస్య జఠిలమైందని వివరించారు. చివరికి ఈ అలవాటే తనను ఆపరేషన్ టేబుల్ వరకు తీసుకెళ్లిందని ఆమె వాపోయారు.ఈ మేజర్ సర్జరీ కోసం సుమారు రూ. 3 లక్షలు ఖర్చయిందని, శారీరకంగా తాను భరించలేని నరకాన్ని అనుభవించానని షకీలా కన్నీటిపర్యంతమయ్యారు. ప్రస్తుతం కనీసం మంచం దిగాలన్నా, ఆహారం తినాలన్నా ఇతరుల సహాయం తీసుకోవాల్సిన దీనస్థితిలో ఉన్నానని చెప్పారు. తన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ గుణపాఠం నేర్చుకోవాలని కోరారు.ఈ సందర్భంగా ఆమె స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. "దయచేసి ఎవరూ ఫోన్‌ను అతిగా వాడి ఆరోగ్యం పాడుచేసుకోవద్దు. స్క్రీన్ టైమ్ తగ్గించుకోండి" అని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను స్మార్ట్‌ఫోన్లు, ఇతర గాడ్జెట్లకు దూరంగా ఉంచాలని, లేదంటే భవిష్యత్తులో వారు కూడా