
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ పార్టీని వెంటాడుతూనే ఉంది. గత ప్రభుత్వ కాలంలో జరిగిన ఈ అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఉదంతం, రోజుకో మలుపు తిరుగుతూ చివరకు పార్టీ అగ్రనాయకత్వం వైపునకు దూసుకువస్తోంది. తాజాగా ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం తీసుకున్న ఒక కీలక నిర్ణయం బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ముగ్గురు బీఆర్ఎస్ ముఖ్య నేతలను నిందితులుగా చేరుస్తూ సిట్ తుది నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ అక్రమ వ్యవహారానికి సంబంధించిన దర్యాప్తును దాదాపుగా కొలిక్కి తెచ్చిన సిట్, నిందితుల జాబితాలో కొత్తగా ఈ ముగ్గురు బీఆర్ఎస్ ముఖ్యులను చేరుస్తూ సప్లిమెంటరీ చార్జ్‌షీట్ సిద్ధం చేసింది. దీనిపై ఇప్పటికే న్యాయ నిపుణుల ఆమోదం కూడా లభించినట్లు తెలుస్తోంది. సాధారణంగా కేసుల విచారణ మధ్యలో కొత్త నిందితులను చేర్చాల్సి వచ్చినప్పుడు న్యాయస్థానంలో మెమో దాఖలు చేయడం ఒక పద్ధతి. సిట్ కూడా ముందస్తు జాగ్రత్తగా ఈ అభియోగపత్రంతో పాటే కోర్టులో మెమో దాఖలు చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంది. సాంకేతికపరమైన అనుమతులు కూడా లభించడంతో, ఈ ముగ్గురిపై అధికారికంగా చట్టపరమైన చర్యలు ముందుకు పడనున్నాయి. సిట్ దర్యాప్తులో తేలిన గణాంకాలు, తేదీలు ఈ కేసు తీవ్రతను కళ్ళకు కడుతున్నాయి. ముఖ్యంగా 2023 నవంబరు 15 నుంచి నవంబరు 30వ తేదీ వరకు కేవలం 15 రోజుల వ్యవధిలోనే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా ఈ ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారం అత్యంత ఉధృతంగా సాగినట్లు సిట్ గుర్తించింది. ఈ స్వల్ప వ్యవధిలోనే ఏకంగా 4,013 మందిపై నిఘా ఉంచినట్లు దర్యాప్తులో తేలింది. వీరిలో 618 మందికి సంబంధించిన ఫోన్ సంభాషణలను అత్యంత అక్రమ పద్ధతిలో వినేందుకు ఎస్ఐబీ ప్రయత్నించిందని ఆధారాలతో సహా నిరూపితమైంది. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాల వ్యూహాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ భారీ