ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ.. చెరువు ఎఫ్ టీఎల్ లో లేదు
Actor ProfilePolitician

ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ.. చెరువు ఎఫ్ టీఎల్ లో లేదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ.. చెరువు ఎఫ్ టీఎల్ లో లేదు
Andhra Jyothy17 Oct 2026
ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ.. చెరువు ఎఫ్ టీఎల్ లో లేదు

ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ భవనం సల్కం చెరువు ఎఫ్‌టీఎల్‌ (ఫుల్‌ ట్యాంక్‌ లెవెల్‌) పరిధిలో లేదని హైకోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది. ఈ మేరకు రెవెన్యూ, నీటిపారుదల శాఖ సంయుక్తంగా.. హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం.. రెవెన్యూ, నీటిపారుదల శాఖ సర్వే రిపోర్టును సమర్పించిన ఏఏజీ సల్కం చెరువులో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు మ్యాపుల్లో స్పష్టమవుతోంది కదా? ఎఫ్‌టీఎల్‌ తుది నోటిఫికేషన్‌ ఎందుకు ఇవ్వలేదు? గతంలో ఉన్న ఎఫ్‌టీఎల్‌ ఇప్పుడు ఎలా తగ్గింది? హైదరాబాద్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ భవనం సల్కం చెరువు ఎఫ్‌టీఎల్‌ (ఫుల్‌ ట్యాంక్‌ లెవెల్‌) పరిధిలో లేదని హైకోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది. ఈ మేరకు రెవెన్యూ, నీటిపారుదల శాఖ సంయుక్తంగా నిర్వహించిన సర్వే నివేదికను అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్‌ హైకోర్టుకు సమర్పించారు. గత ప్రభుత్వ హయాంలో మిషన్‌ కాకతీయ కింద సల్కం చెరువు కట్టను అభివృద్ధి చేశారని.. ప్రస్తుతం ఎఫ్‌టీఎల్‌లో ఎలాంటి నిర్మాణాలు లేవని చెప్పారు. ఒవైసీ విద్యాసంస్థను సల్కం చెరువు ఎఫ్‌టీఎల్‌ ఆక్రమించి కట్టారని పేర్కొంటూ న్యాయవాది విజయ్‌గోపాల్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా రెవెన్యూ, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా నిర్వహించి రూపొందించిన నివేదికను ఏఏజీ హైకోర్టుకు సమర్పించారు. ఈ రిపోర్టును, సంబంధించిన మ్యాపులను పరిశీలించిన ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ‘చెరువులోకి అక్రమ నిర్మాణాలు చొచ్చుకొని వచ్చినట్లు మ్యాపుల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఎఫ్‌టీఎల్‌ ఆక్రమణకు గురి కాలేదని ఎలా చెబుతారు? గత కాస్ర పహాణీల్లో చెరువు విస్తీర్ణం 39 ఎకరాలుగా రికార్డయి ఉంది. 2016లో సల్కం చెరువు ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేశారు. అప్పుడు ఉన్న ఎఫ్‌టీఎల్‌ ఇప్పుడు ఎలా తగ్గింది? పదేళ్లుగా ఈ చెరువు ఎఫ్‌టీఎల్‌పై తుది నోటిఫికేషన్‌ ఎందుకు ఇవ్వలేదు?’ అంటూ నిలదీసింది. ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు నచ్చినవారి పట్ల ఒక విధంగా