ఫౌజీ’ లేటెస్ట్ పోస్టర్ లో ఆ నటుడు.. మరో ఇంట్రెస్టింగ్ డీటెయిల్
Actor ProfileActor

ఫౌజీ’ లేటెస్ట్ పోస్టర్ లో ఆ నటుడు.. మరో ఇంట్రెస్టింగ్ డీటెయిల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఫౌజీ’ లేటెస్ట్ పోస్టర్ లో ఆ నటుడు.. మరో ఇంట్రెస్టింగ్ డీటెయిల్
123Telugu1 Jan 2027
ఫౌజీ’ లేటెస్ట్ పోస్టర్ లో ఆ నటుడు.. మరో ఇంట్రెస్టింగ్ డీటెయిల్

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ లలో దర్శకుడు హను రాఘవపూడి కలయికలో చేస్తున్న హిస్టారికల్ వార్ చిత్రం ‘ఫౌజీ’ కూడా ఒకటి. అభిమానుల్లో కొంచెం ప్రత్యేక అంచనాలు ఈ సినిమా పట్ల ఉన్నాయి. ఇక అందుకు తగ్గట్టుగానే మేకర్స్ నెక్స్ట్ లెవెల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా నిన్న స్వాతంత్ర దినోత్సవం కానుకగా వదిలిన పోస్టర్ మరింత ఆసక్తి రేకెత్తించింది. అయితే ఇందులో ప్రభాస్ తో పాటు మరో పాత్ర కూడా కనిపిస్తుంది. అది గాంధీజినే అని చాలామందికి అర్ధం అయ్యింది కూడా.. కానీ అఫీషియల్ గా రివీల్ చేసేవరకు ఏది క్లారిటీ రాదు. అయితే గాంధీజీ పాత్రలో బాలీవుడ్ వెర్సటైల్ నటుడు అనుపమ్ ఖేర్ నటించినట్టు తెలుస్తుంది. అయితే అనుపమ్ పై ఈ సినిమాలో కేవలం ఓల్డేజ్ లుక్ కి సంబంధించిన సన్నివేశాలే కాకుండా యుక్త వయసులో కూడా కొన్ని కీలక సన్నివేశాలు దర్శకుడు తెరకెక్కించినట్టు తెలుస్తుంది. సో ‘ఫౌజీ’ని మాత్రం హను రాఘవపూడి చాలా డిటైలింగ్ గా ప్లాన్ చేస్తున్నారని చెప్పొచ్చు. మరి ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో డ్రామా ఇంకెలా ఉంటుందో చూడాలి